Monday, May 18, 2020

2030 డేజ‌ర్ జోన్‌..!

అమెరికా: కోవిడ్ -19 మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇప్ప‌టికే పేద‌రికంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారితో పాటు అద‌నంగా మ‌రో 13 కోట్ల మంది క‌డు దారిద్య్రంలోకి నెట్టివేయ‌బ‌డ‌నున్నార‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి(యూఎన్‌) ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. 2030 క‌ల్లా వీరంతా తీవ్ర దుర్భిక్ష ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటార‌ని తెలిపింది. 2030 నాటికి పేద‌రికాన్ని నిర్మూలించాల‌ని పెట్ట‌కున్న యూఎన్‌కు..తాజా ప‌రిస్థితుల్లో అది సాధ్యం కాక‌పోగా కోట్ల‌లో జ‌నం పేద‌లుగా మారుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. 
యూఎన్ తాజా నివేదిక ప్ర‌కారం..ఈ క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఈ ఏడాది 3.4 కోట్ల మంది తీవ్ర పేద‌రికంలోకి వెళ్ల‌నున్నారు. వీరిలో 56 శాతం మంది ఆఫ్రికా దేశాల నుంచే ఉండొచ్చు. వీరితో పాటు 2030 నాటికి అద‌నంగా 13కోట్ల మంది  ప్ర‌జ‌లు దారిద్య్ర రేఖ‌కు దిగువ‌కు వెళ్ల‌నున్నారు. దీని కార‌ణంగా పేద‌రికాన్ని, ఆక‌లి బాధ‌ల‌ను రూపుమాపాల‌ని ప్ర‌పంచ దేశాలు ఇర‌వై ఏండ్లుగా ప‌డ్డ శ్ర‌మంతా వృథా కానుంది...అని పేర్కొంది. కాగా, తాజా ఆర్థిక సంక్షోభంతో ఇర‌వై ఏండ్లుగా క‌ష్టాలు ప‌డుతూ కొంత మెరుగైన స్థితికి వ‌చ్చిన‌వారిలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా 8 శాతం మంది ఈ ఏడాది చివ‌రిక‌ల్లా య‌థాస్థితికి చేరుకుంటార‌ని యూఎన్ ఇప్ప‌టికే అంచ‌నా వేసిన విష‌యం విధిత‌మే. 
క‌రోనా కార‌ణంగా ప్ర‌పంచం వృద్ధి రేటు నాలుగేండ్లు దిగువ‌కు ప‌డిపోయింద‌ని యూఎన్ తెలిపింది. విలువ‌ప‌రంగా ఇది దాదాపు రూ.600 ల‌క్ష‌ల కోట్ల మేర ఉంటుంద‌ని అంచ‌నావేసింది. ఆర్థికంగా బాగా దెబ్బ‌తిన‌డంతో.. ఈ ఏడాది ప్ర‌పంచ జీడిపి 3.2 శాతంకోల్పోనుంద‌ని అంత‌ర్జాతీయ ద్ర‌వ్య‌నిధి సంస్థ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం విధిత‌మే. మ‌రో వైపు కోవిడ్‌-19 కార‌ణంగా డిజిట‌లైజేష‌న్‌, ఆటోమేష‌న్ భారీగా పెరిగే అవ‌కాశ‌ముంద‌ని యూఎన్ తెలిపింది. దాంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోతార‌నీ, త‌ద్వారా ప్ర‌జ‌ల మ‌ధ్య ఆదాయ అస‌మాన‌త‌లు పెరుగుతాయ‌ని యూఎన్ హెచ్చ‌రించింది. దీన్ని ఆస‌రాగా తీసుకొని ఆయా ప్ర‌భుత్వాలు తెస్తున్న కొత్త వేత‌న చ‌ట్టాలు అస‌మాన‌త‌ల‌కు దారితీసే ప్ర‌మాద‌ముంద‌ని యూఎన్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. 
ఇదే విష‌య‌మై యూఎన్ ప్ర‌తినిధి హామీద్ ర‌షీద్ స్పందిస్తూ..." ఆర్థిక‌, ద్ర‌వ్య ఉద్ధీప‌న ప‌థ‌కాల‌తో ఉత్పాద‌క‌త పెట్టుబ‌డిని పెంచాల్సిన ప‌నిలేద‌ని గ‌త సంక్షోభం నుంచి మ‌నం నేర్చుకున్నాం." ..అని అన్నారు. ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌కు ఉద్యోగ‌వ‌కాశాలు క‌ల్పించి, వాటిని ర‌క్షించాల‌ని, త‌ద్వారా ఆదాయ అస‌మాన‌త‌ల‌ను రూపుమాపాల‌ని ఆయ‌న సూచించారు. నైపుణ్యం లేని, త‌క్కువ జీతం ఉన్న వారిని ఈ మ‌హ‌మ్మారి ఎక్కువ ప్ర‌భావితం చేసింద‌నీ, వృత్తిప‌రంగా నైపుణ్యం ఉన్న‌వాళ్లు త‌క్కువ ప్ర‌భావిత‌మ‌య్యార‌ని ర‌షీద్ తెలిపారు. 

No comments:

Post a Comment