Saturday, May 30, 2020

బ్యాగ్ తెరిచారు.18మందికి క‌రోనా వైర‌స్ సోకింది..!

ముంబాయి(Mumbai):
క‌రోనా వైర‌స్ విష‌యంలో ఎంత జాగ్ర‌త్త‌గా ఉండాలో..ఒక వేళ జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే ఎంత ప్ర‌మాద‌మో..! ఈ వార్త‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. దేశంలో రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నా ప‌లువురు మాత్రం ఇంకా నిర్ల‌క్ష్యంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అందుకు ఉదాహ‌ర‌ణే తాజాగా మ‌హారాష్ట్ర‌లోని థానేలో చోటుచేసుకున్న ఘ‌టన‌. 40 ఏళ్ల ఓ మ‌హిళ ఇటీవ‌ల క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాల‌తో మృతి చెందింది. వైద్యులు ఆమె మృత‌దేహాన్ని ప్యాక్‌చేసి బంధువుల‌కు అప్ప‌గించారు. దాన్ని తెర‌వ‌కుండా నేరుగా అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాల‌ని ఆదేశించారు అధికారులు. కానీ వారి ఆదేశాల‌ను పెడ‌చెవిన పెట్టారు. అంతిమ సంస్కారాల్లో ఆమె మృత‌దేహాం ప్యాక్ చేసిన బ్యాగ్ ను తెర‌వ‌డంతో బంధువుల్లో 18 మందికి వైర‌స్ సోకింది. థానే జిల్లాలోని ఉల్లాస్ న‌గ‌ర్‌లో మే 25న ఓ మ‌హిళ‌(40) క‌రోనా ల‌క్ష‌ణాల‌తో మృతి చెందింది. వైద్యులు ఆమె మృత‌దేహానికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించి త‌ర్వాత ప్యాక్‌చేసి బంధువుల‌కు అప్ప‌గించారు. దాన్ని తెర‌వ‌కుండా నేరుగా అంత్య‌క్రియలు పూర్తి చేయాల‌ని ఆదేశించారు. అయినా ఆమె బంధువులు అంతిమ సంస్కారాల కోసం ప్యాక్ చేసిన బ్యాగ్ తెరిచి మృదేహాన్ని తాకి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి సుమారు 100 మంది హాజ‌ర‌య్యారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన ఫ‌లితాల్లో  మృతురాలికి క‌రోనా పాజిటివ్‌గా తేల‌డంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్న 50 మందిని తొలుత క్వారంటైన్ చేయ‌గా..అందులో 18 మందికి శుక్ర‌వారం పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. దీంతో ఇప్పుడు మిగ‌తావారిని గుర్తించే ప‌నిలో ప‌డ్డారు అధికారులు. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన ఉల్లాస్‌న‌గ‌ర్ మున్సిప‌ల్ శాఖ సీనియ‌ర్ అధికారి ఒక‌రు మీడియాతో మాట్లాడుతూ...సంబంధిత బంధువుల‌పై పోలీస్ కేసు న‌మోదు చేస్తామ‌ని చెప్పారు. అంత్య‌క్రియ‌ ల‌కు సంబంధించిన నిబంధ‌న‌ల‌ను వారు ఉల్లంగించార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

No comments:

Post a Comment