Friday, May 29, 2020

ఇక నుంచి 100 రోజులే స్కూళ్లు ..!

న్యూఢిల్లీ(NewDelhi) :
క‌రోనా వైర‌స్ ఉధృతితో అన్ని వ్య‌వ‌స్థ‌లు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. వైర‌స్ ఎక్క‌వుగా పిల్ల‌లు, వృద్ధుల‌కు వ్యాపిస్తుంద‌న్న నిపుణుల హెచ్చ‌రిక‌ల‌తో కేంద్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. ముఖ్యంగా స‌రికొత్త ప్ర‌ణాళిక‌తో విద్యావ్య‌వ‌స్థ నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌భుత్వం వ్యూహాలు ర‌చిస్తున్న‌ట్లు నిపుణులు చెబుతున్నారు. గ‌తంలో మాదిరిగా స్కూళ్లు కు 220 ప‌నిదినాలు 1,320 గంట‌ల త‌ర‌గ‌తి బోధ‌న ఇక మీద‌ట ఉండ‌ద‌ని విద్యావేత్త‌లు భావిస్తున్నారు. గ‌త విద్యావ్య‌వ‌స్థ‌కు ప్ర‌త్యామ్నాయంగా రాబోయే  విద్యాసంవ‌త్స‌రంలో స్కూళ్ల‌కు 100 రోజుల ప‌నిదినాలు, 600 గంట‌ల త‌ర‌గ‌తి బోధ‌న‌కు ప్ర‌భుత్వం ఆమోదం తెలిపే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. 
అలాగే విద్యార్థికి ఇంట్లోనే ఆన్‌లైన్‌బోధ‌న‌లో 100 రోజులు, 600 అభ్యాస గంట‌ల విద్యాప్ర‌ణాళిక‌ల‌ను ప్ర‌భుత్వం ర‌చిస్తున్న‌ట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా మ‌రో 20 రోజులు విద్యార్థి మాన‌సిక వికాసాన్ని పెంచే విధంగా డాక్ట‌ర్లు, కౌన్సిల‌ర్లు తో విద్యార్థుల‌కు ప్రేర‌ణ క‌లిగించే కార్య‌క్ర‌ములు చేప‌ట్ట‌నున్న‌ట్టు ప్ర‌భుత్వం భావిస్తోంది. ఆన్‌లైన్ సౌక‌ర్యాలు లేని విద్యార్థులపై స్కూల్ యాజ ‌మాన్యాలు దృష్టి పెట్టాల‌ని హెచ్ ఆర్‌డి మంత్రిత్వ‌శాఖ సూచించింది. ఇవి చ‌ద‌వండి:గాలి వాటున మిడ‌త‌ల దండు ప్ర‌యాణం..

డిగ్రీ , పీజీ ప‌రీక్ష‌ల‌పై క్లారిటీ

హైద‌రాబాద్(Hyderabad) : క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో తెలంగాణ‌లో వాయిదా ప‌డిన డిగ్రీ, పీజీ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై రాష్ట్రంలోని విశ్వ‌విద్యాల‌యాల‌కు రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి ప‌లు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. తుది సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు 
మాత్ర‌మే నిర్వ‌హించాల‌ని యూనివ‌ర్శిటీల‌కు సూచించింది. డిగ్రీ, పీజీ చివ‌రి ఏడాది చ‌దువుతున్న విద్యార్థుల‌కు జూన్ 20 నుంచి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌వ‌చ్చ‌ని విశ్వ‌విద్యాల‌యాల‌కు ఉన్న‌త విద్యామండ‌లి అనుమ‌తి ఇచ్చింది. మిగ‌తా సెమిస్ట‌ర్ల‌కు న‌వంబ‌ర్ లేదా డిసెంబ‌ర్‌లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని సూచిం చింది. ప‌రీక్షా స‌మ‌యాన్ని రెండు గంట‌ల‌కు కుదించాల‌ని..ప్ర‌శ్నాప‌త్రంలోనూ ఎక్కువ ఐచ్చికాలు ఇవ్వాల‌ని తెలిపింది. అన్ని సెమిస్ట‌ర్ విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు లేకుండానే తాత్కాలికంగా ప్ర‌మోట్ చేయాల‌ని సూచించింది. ప్రాజెక్టులు, సెమినార్లు, వైవాలు ఆన్‌లైన్‌లోనే నిర్వ‌హించాల‌ని ఉన్న‌త విద్యామండ‌లి సృష్టం చేసింది. 

No comments:

Post a Comment