Friday, May 22, 2020

10 వేల మంది ఆరోగ్య‌కార్య‌క‌ర్త‌ల‌కు క‌రోనా!

టెహ్రాన్: ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ రోజురోజుకూ తీవ్ర రూపందాల్చుతోంది. సామ‌న్య ప్ర‌జ‌లతో పాటు పోలీసులు, డాక్ట‌ర్లు, న‌ర్సుల‌కు ఈ క‌రోనా వైర‌స్ సోకి మృతిచెందుతున్నారు. తాజాగా మ‌ధ్య‌ప్రాచ్య దేశం ఇరాన్‌లో దాదాపు 10 వేల మంది ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు క‌రోనా బారిన ప‌డిన‌ట్టు ఆ దేశ వార్తా సంస్థ‌లు గురువారం తెలిపాయి. ఆరోగ్య‌శాఖ స‌హాయ మంత్రి ఖాసీమ్ జాన్‌బాబాయి ఈ విష‌యం తెలిపిన‌ట్లు ఐఎస్ఎన్ ఏ వార్తా సంస్థ తెలిపింది. అయితే కొన్ని రోజుల క్రితం వెలువ‌డ్డ స‌మాచారం ప్ర‌కారం దాదాపు 800 మంది ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు వైర‌స్ బారిన ప‌డ్డారు. వీరిలో సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయార‌ని ఇరాన్ చెబుతోంది. వైర‌స్ కార‌ణంగా గురువారం నాటికి ఇరాన్లో 7,249 మంది మ‌ర‌ణించారు. ఇప్ప‌టి వ‌ర‌కూ దేశంలో మొత్తం 1.29 ల‌క్ష‌ల మందికి క‌రోనా సోకింది. బుధ‌వారం నుంచి 24 గంట‌ల్లో 2,392 మంది కొత్త‌గా వ్యాధి బారిన ప‌డ్డారు. 

No comments:

Post a Comment