Friday, May 22, 2020

రూ.10 ఆన్‌లైన్లో అడిగి రూ.2ల‌క్ష‌లు దోచేశారు

హైద‌రాబాద్:  అస‌లే కరోనాతో  ఆర్థిక ఇబ్బందులు ఎక్కువై ఉపాధి లేక ఇబ్బందులు ప‌డుతున్న ప్ర‌జ‌ల‌కు కొత్త స‌మ‌స్య‌లు, ఇబ్బందులు వ‌చ్చిప‌డుతున్నాయి. అదే దొంగ‌త‌నం లాంటి ఆన్‌లైన్‌లో డ‌బ్బులు దోచుకోవ‌డం.విష‌యానికి వ‌స్తే ..హైద‌రాబాద్‌లోని వ‌న‌స్థ‌లిప‌రంలో సైబ‌ర్ నేర‌గాళ్ల మోసం ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. సిమ్ డియాక్టివేట్ చేస్తామ‌ని వ‌ర‌ల‌క్ష్మి అనే ఉపాధ్యాయురాలు వ‌ద్ద నుండి రూ.10 ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫ‌ర్ చేయించుకున్నారు. రూ.10 ఫోన్‌పే  చేయ‌డంతో వ‌ర‌ల‌క్ష్మి అకౌంట్ నుంచి రూ.2 ల‌క్ష‌లు దోచేశారు. అప్ర‌మ‌త్త‌మైన టీచ‌ర్ సైబ‌ర్ క్రైం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఆన్‌లైన్ మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్ విష‌యంలో ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, అప‌రిచిత వ్య‌క్తుల ఫోన్ నెంబ‌ర్లు విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ఎలాంటి ప‌ర్స‌న‌ల్, బ్యాంకు వివ‌రాలు తెలియ‌జేయ‌వ‌ద్ద‌ని పోలీసులు సూచిస్తున్నారు. 

No comments:

Post a Comment