Thursday, January 16, 2020

దుమ్ము రేపుతున్న (అల..వైకుంఠపురములో..) స్టైలిష్‌ స్టార్‌

నాలుగురోజుల నుండి అదే హవా..!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సక్సెస్‌ఫుల్‌ కాంబో విజయవంతంగా హ్యాట్రిక్‌ సాధించింది. ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన 'అల..వైకుంఠపురములో...' సినిమా పండగ విన్నర్‌గా నిలిచి బన్నీ అభిమానుల్లో జోష్‌ నింపింది. విడుదలైన మొదటి షో నుంచే వసూళ్ల ప్రవాహం పారిస్తున్న ఈ సినిమా నాలుగో రోజూ అదే హవా కొనసాగిస్తుంది. 
మొదటి రోజే తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను కనువిందు చేసిన 'అల..వైకుంఠపురములో..' సినిమా రూ.25.56 కోట్ల షేర్‌ రాబట్టి సక్సెస్‌ అయ్యింది. ఆ తర్వాత అదే ఫామ్‌ కంటిన్యూ చేస్తూ రెండో రోజూ, మూడో రోజూ సత్తా చాటింది. ఇక నాలుగో రోజు కూడా మరింత పుంజుకొని సంక్రాంతి అల్లుళ్లందర్నీ థియోటర్స్‌కి రప్పిస్తోంది. నాలుగో రోజు నుంచి రూ.12 కోట్లు రాబట్టినట్లు ఫలితాలు అందాయి. అంటే మూడో రోజుతో పోల్చితే ఇంకా మెరుగైన వసూళ్లే వచ్చాయని అర్థమవుతోంది. రోజురోజుకూ పాజిటివ్‌ టాక్‌ పెరుగుతుండటం ఈ సినిమాకు బాగా కలిస్తోంది.
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌ మార్కెట్‌లో 'అల..వైకుంఠపురములో..' మూవీ దుమ్ముదులుపుతుంది. సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తూ స్పీడు పెంచేసింది. ఈ సంక్రాంతి పందెకోడి.. నాలుగో రోజు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్‌ రిపోర్టు చూస్తే రూ.11 నుంచి 13 కోట్లు వచ్చాయని తెలుస్తోంది. 
ఇక షేర్‌ విషయానికి వస్తే ఇప్పటి దాకా అందిన సమాచారం ప్రకారం... నాలుగో రోజు ముగిసే సరికి తెలుగు రాష్ట్రాల్లో 'అల..వైకుంఠపురములో..' మూవీ 56.5 నుంచి 59 కోట్ల షేర్‌ రాబట్టిందని తెలిసింది. అలాగే వరల్డ్‌ వైడ్‌ మొత్తంగా షేర్‌ రూ.71 నుంచి రూ.74 కోట్లు అని తెలిసింది. మరియు సంక్రాంతి సెలవులు కూడా మరింత ప్లస్‌ అయ్యాయి. అతి త్వరలో ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ క్రాస్‌ చేయనుంది. 
గీత ఆర్ట్స్‌, హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంయుక్త సమర్పణలో 'అల..వైకుంఠపురములో' మూవీ రూపొందింది. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లు అర్జున్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. టబు, రాజేంద్రప్రసాద్‌, తనికెళ్ల భరణి సుశాంత్‌, నివేతా పేతురాజ్‌, సునీల్‌, బ్రహ్మాజీ, నవదీప్‌, సముద్రఖని ముఖ్యపాత్రలు పోషించారు. 

No comments:

Post a Comment