కర్ణాటక : డిస్కవరీ ఛానల్‌లో ప్రసారం కానున్న 'మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌' టీవీషోలో ఈ సారి తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కనిపించనున్నారు. ఈ షోకు సంబంధించి చిత్రీకరణ కోసం బ్రిటన్‌కు చెందిన సాహస వీరుడు బేర్‌ గ్రిల్స్‌ మంగళవారం కర్ణాటక చేరుకున్నారు. బందిపూర్‌ అటవీ ప్రాంతంలో రజనీతో కలిసి బేర్‌ గ్రిల్స్‌ 'మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌' షోను చిత్రీకరించనున్నారు.  వీరిద్దరూ కలిసి టైగర్‌ రిజర్వ అటవీ ప్రాంతంలో తిరగనున్నారు. సుమారు ఆరు గంటల పాటు వీరిద్దరూ అడవిలో గడపనున్నారు. నేటి నుంచి ఈ నెల 30 మద్యలో ఈ చిత్రీకరణ జరగనుంది.
గతేడాది 'మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌ ' టీవీ షోలో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొన్నారు. ఉత్తరాఖండ్‌లోని జిమ్‌ కార్బెట్‌  అటవీ ప్రాంతంలో బేర్‌ గ్రిల్స్‌తో కలిసి మోదీ కలియతిరిగారు. మోదీతో చేసిన ఈ షో అత్యంత ప్రేక్షకాదరణ పొందింది. ఆగష్టు 12న ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా దేశాల్లో డిస్కవరీ నెట్‌వర్క్‌పై ఈ మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌ కార్యక్రమం ప్రసారమైంది. రజనీకాంత్‌తో 'మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌' కార్యక్రమం ఎప్పుడు ప్రసారమవుతుందనే వివరాలు ఇంకా వెల్లడించలేదు. 

Post a Comment

Previous Post Next Post