Wednesday, January 29, 2020

అంచనాలను పెంచుతున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీ

కొత్తగా బాలివుడ్‌ హీరో ఎంట్రీ

హైదరాబాద్‌: బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగానే గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తాను చాటిన ఉత్తమ దర్శకుడు. ఆయన ప్రస్తుతం తెరకెక్కిస్తున్న అత్యంత భారీ మల్టీ స్ఠారర్‌ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ఓ రేంజ్‌ హైప్‌ క్రియేట్‌ అయింది. తాజాగా ఈ మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. 
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌లో బాలివుడ్‌ స్టార్‌  హీరో అజయ్‌దేవగణ్‌ చేరాడు. ఈ మేరకు నిర్మాతలు ఓ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఈ మూవీ వికారాబాద్‌ అడవుల్లో ఎన్టీఆర్‌, అజయ్‌దేవగణ్‌లకు సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. 
ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌పై అదిరిపోయే సీన్స్‌ తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌కు సంబంధించిన ముఖ్యమైన ప్రతీ సీన్స్‌ లీకవ్వడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో వీటిని ఎంత గుట్టుగా ఉంచాలనుకుంటే అంత రచ్చగా తయారవుతోంది. విశాఖ అడవుల్లో తెరకెక్కించిన ఎన్టీఆర్‌  సీన్స్‌ లీకై పెద్ద దుమారమే రేగింది. తాజాగా అలాంటి సీనే ఒకటి జరిగింది. ఈ మూవీలో యంగ్‌ టైగర్‌ ఓ పులితో తలపడుతున్నట్లు తెలుస్తోంది. 
ఈ సినిమాలో  హీరోలుగా నటిస్తున్న రామ్‌చరణ్‌ సరసన బాలీవుడ్‌ హీరోయిన్‌ అలియాభట్‌ నటిస్తుండగా, మరో హీరో ఎన్టీఆర్‌ సరసన హాలీవుడ్‌ హీరోయిన్‌ ఒలీవియో నటిస్తోంది. 
అయితే ఈ మూవీలో ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్న అజయ్‌దేవగణ్‌కు కూడా ఓ హీరోయిన్‌ అవసరం ఉంటుందట. ఆమె క్యారెక్టర్‌కి కూడా ఇంపార్టెన్స్‌ ఉంటుందని టాక్‌. అందుకే అజయ్‌ సరసన శ్రియను తీసుకున్నట్టు సమాచారం. ఇంతకుముందే వీరిద్దరు దృశ్యం బాలీవుడ్‌ రీమేక్‌లో కలిసి నటించారు. 

No comments:

Post a Comment