వావ్‌...ఈటీవీ భారత్‌..!

రామోటీ ఫిల్మిసిటీని సందర్శించిన యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌మన్‌

హైదరాబాద్‌ : యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌మన్‌ శుక్రవారం రామోజీ ఫిల్మ్‌సిటీని సందర్శించారు. అంతకుముందు రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మీడియా రంగంలో ఆయన సాధించిన అద్భుత విజయాల వెనుకున్న కృషిని ఆసక్తిగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రామోజీరావు ఈనాడు, ఈటీవీ, ఫిల్మ్‌సిటీ, ఈటీవీ భారత్‌ల గురించి వివరించారు. కాన్సులేట్‌ ప్రజా సంబంధాల అధికారి డ్య్రూగిబ్లిన్‌, మీడియా సలహాదారు మహ్మద్‌ బాసిత్‌లతో కలిసి 'ఈటీవీ భారత్‌' ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఆయనకు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో 13 భారతీయ భాషల్లో వార్తలను అందిస్తున్న వైనాన్ని ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ కె.బాపినీడు, ఎడిటోరియల్‌ సిబ్బంది వివరించారు. యాప్‌ విభాగంలో దేశంలోనే తొలిసారి అతిపెద్ద వార్తా స్రవంతిని సృష్టించడాన్ని రీఫ్‌మన్‌ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఫిల్మ్‌సిటీలో బాహుబలి సెట్టింగులను చూపించారు. ఇంత మంచి ప్రదేశాల్లో సినిమాల నిర్మాణానికి అమెరికాలోని సినీరంగమూ ఆసక్తి చూపిస్తుందన్నారు.


Post a Comment

0 Comments