Saturday, January 18, 2020

"మోదీకి ఉన్న పరిపక్వత రాహుల్‌కు లేదు"

ప్రముఖ చరిత్ర కారుడు రామచంద్రగుహ వ్యాఖ్యలు

కేరళ : కాంగ్రెస్‌ ముఖ్యనేత రాహుల్‌ గాంధీపై ప్రముఖ చరిత్రకారుడు రామచంద్రగుహ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ను వయనాడ్‌ ఎంపీగా గెలిపించి కేరళ ప్రజలు తప్పు చేశారని అన్నారు. ప్రస్తుతం యంగ్‌ ఇండియాకు ఐదో తరానికి చెందిన రాహుల్‌ నాయకత్వం అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఆయనతో పోల్చుకుంటే ప్రధాని నరేంద్రమోడీకి ఉన్న తెలివితేటలు ఎంతో గొప్పవని అభిప్రాయపడ్డారు. రాహుల్‌ అసమర్థతే మోదీకి ఎంతో ప్రయోజనమని అన్నారు. తిరువనంతపురంలో జరుగుతున్న 'కేరళ లిటరేచర్‌ ఫెస్టివల్‌' రెండోరోజు సభలో శనివారం ఆయన పాల్గొన్నారు. 'దేశభక్తి-మతోన్మాదం' అనే అంశంపై ఆయన ప్రసంగించారు.
ఎంతో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ నేడు నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోందన్నారు. 'రాహుల్‌గాంధీపై నాకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదని.నేటి యంగ్‌ జనరేషన్‌కి ఐదో తరానికి చెందిన రాహుల్‌ గాంధీ నాయకత్వం అవసరం లేదని' వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబ కంచుకోట అయిన అమేథిలోని ఓటమి చెందారని, రాహుల్‌ను కేరళ ప్రజలు ఎంపీగా ఎన్నుకుని తప్పిందం చేశారని అన్నారు. 2024 లో మరోసారి అదేపని చేస్తే మోదీకి ఎంతో లబ్ధి చేకూర్చినట్లు అవుతుందన్నారు.

No comments:

Post a Comment