మూగబోయిన కేరింతలు, కేకలు - బిసిసిఐ సంతాపం

క్రికెట్‌ అంటే ఇష్టపడే అభిమానుల్లో  ప్రపంచ వ్యాప్తంగా  గర్వించదగిన  'సూపర్‌ అభిమానులు' లు  కూడా ఉన్నారు. అందులో మన ఇండియా క్రికెట్‌ అంటే ప్రాణంతో సమానంగా భావిస్తారు. అలా అభిమానం పెంచుకున్న తన జీవిత కాలమంతా జట్టును తన కేకలతో, కేరింతలతో ప్రోత్సహించిన ఓ మహా అభిమాని ఇప్పుడు లేదు. ఆమె ఎవరంటే 'సూపర్‌ ఫ్యాన్‌' చారులతా పటేల్‌ (87). గతేడాది వరల్డ్‌కప్‌లో టీమిండియాలో ఆమె సందడి అంతా ఇంతా కాదు. భారత్‌ గెలిచిన ప్రతీ మ్యాచ్‌లోనూ ఆమె సందడి చేస్తూ ప్రేక్షకుల్లో సరికొత్త జోష్‌ను తీసుకొచ్చారు. 87 ఏళ్ల వయసులోనూ చారులతా పటేల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లను చూడటానికి స్టేడియానికి వచ్చి మరీ మ్యాచ్‌లను వీక్షించారు. అయితే ఇప్పుడు ఆమె ఇకలేరని వార్త క్రికెట్‌ అభిమానుల్లో విషాదం నింపింది. జనవరి 13వ తేదీ ఉదయం గం.5.30 నిలకు ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు సృష్టం చేశారు.
వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా - బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చారులతా పటేల్‌ ఒక సెలబ్రెటీగా మారిపోయారు. మ్యాచ్‌ జరుగుతున్నంతా సేపు అభిమానుల్ని ఉత్సాహ పరుస్తూ ఆమె సందడి చేశారు. ఆ మ్యాచ్‌ ముగిసన తర్వాత టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలు ఆమెతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే ఆమె ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఎనిమిది పదుల వయసు దాటినా భారత క్రికెట్‌ అభిమానిగా ఆమె అందరిలో ప్రేరణ నింపడం అభినందనీయం. కాగా తాను భారత క్రికెట్‌ జట్టుకు దశాబ్ధాల నుంచి వీరాభిమానిగా కొనసాగుతున్నారు. 1983 లో కపిల్‌ సేన ప్రపంచ కప్‌ను ముద్దాడిన సమయంలో తాను స్టేడియంలోనే ఉన్నానని విషయాన్ని చారులతా పటేల్‌ ఇది వరకే తెలపడం ఆమెకు క్రికెట్‌పై ఉన్న ప్రేమకు, ప్రధానంగా భారత జట్టుపై ఉన్న అభిమానానికి నిదర్శనం.
భారత సంతతికి చెందిన ఆమె.. పుట్టి పెరిగింది విదేశాల్లోనే. బ్రిటన్‌కు రాకముందు ఆమె దక్షిణాఫ్రికాలో ఉండే వారు. 1975 నుంచి ఆమె బ్రిటన్‌లో ఉన్నారు. చిన్నప్పుటి నుంచి క్రికెట్‌కు వీరాభిమాని అయిన చారులతా పటేల్‌.. భారత్‌ ఆడే మ్యాచ్‌లను క్రమం తప్పకుండా టీవిల్లో వీక్షించేవారు. కాగా, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 'ఈ విషయాన్ని శోకతప్త హృదయాలతో తెలియపరచాల్సి వస్తుంది. మా గ్రాండ్‌ మదర్‌ తుది శ్వాస విడిచారు. ఆమె చాలా మంచి మనిషే కాదు.. ఒక అసాధారణమైన వ్యక్తిత్వం కూడా ఆమె సొంతం. ఆమె మా ప్రపంచం' అని చారులతా పటేల్‌ ఇన్‌స్టాగ్రాంలో కుటుంబ సభ్యుల్లో ఒకరు పోస్టు చేశారు. చారులతా పటేల్‌ మృతిపై బీసీసీఐ సంతాపం వ్యక్తం చేసింది. చారులతా ఎప్పుడూ భారత జట్టుతోనే ఉంటారని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని పేర్కొంది.   

Post a Comment

0 Comments