ఆర్‌టిసిలో ప్రయాణించిన మందకృష్ణ మాదిగ

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తాజాగా ఆర్‌టీసీ బస్సులో ప్రయాణించారు. ఆర్‌టిసి పరిరక్షణ యాత్రను చేపట్టిన ఆయన హైదరాబాద్‌ నుంచి భద్రాచలం వరకు ఆర్‌టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'నష్టాల్లో ఉన్న ఆర్‌టిసి సంస్థ బతకాలంటే ప్రతి ఒక్కరూ సొంత వాహనాల్లో కాకుండా ఆర్‌టిసిలో ప్రయాణించాలి. ఆర్‌టిసి సమ్మె కాలంలో కార్మికులకు మద్దతు ఇచ్చినట్టుగానే ఆర్‌టిసిని బతికించేందుకు ఇప్పుడు బస్సులో ప్రయాణం చేస్తున్నా. లోటు బడ్జెట్‌ ఉన్న ఆంధ్రాలో ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు...ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు. ఆర్‌టిసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.' అని కోరారు. ఆర్‌టిసిని ప్రైవేటు పరం చేయడంలో భాగంగానే సీఎం కేసీఆర్‌ ఉద్యోగ సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారని, టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణం చేయాలన్న కేసీఆర్‌ మాటలు ఎక్కడా కార్యరూపం దాల్చ లేదని తప్పుబట్టారు. 

Post a Comment

0 Comments