హెచ్చరిక..'కరోనా' ఇండియాలో అడుగుపెట్టింది..!

తొలి కేసు నమోదు
ఢిల్లీ : భారత్‌లోని కరోనా వైరస్‌ తొలి కేసు నమోదైంది.  కేరళకు చెందిన ఓ విద్యార్థికి పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ ధ్రువీకరించింది. వుహాన్‌లో సదరు విద్యార్థి విద్యనభ్యసిస్తున్నాడు. కరోనా కలకలంతో అతడు భారత్‌ తిరిగివచ్చాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి స్థిమితంగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే త్రిపురకు చెందిన ఓ వ్యక్తి కరోనా బారిన పడి మలేషియా ఆసుపత్రిలో మృతి చెందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. భారత్‌లోని పలు రాష్ట్రాల్లో  కరోనా లక్షణాలతో అనుమానితులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. చైనా నుంచి భారత్‌ వచ్చిన వారిలో కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారి రక్తనమూనాలను పూణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ విభాగానికి పంపించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. నివేదిక నెగిటివ్‌ వస్తే వారిని వెంటనే డిశ్చార్జి  చేస్తున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా చైనాలో 170 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. హైదరాబాద్‌, కేరళ,  పట్నాలోను కరోనా అనుమానితులు ఆసుపత్రుల్లో చేరారు. 

Post a Comment

0 Comments