ఎక్కడున్నా... వ్యూహాన్ని అమలుచేయాల్సిందే...!

మున్సిపల్‌ పోలింగ్‌ వేళ..పార్టీ నేతలకు ఫోన్లతో సలహాలు, సూచనలు
- దావోస్‌ పర్యటనలో ఉన్న కేటీఆర్‌

హైదరాబాద్‌ : నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 120 పురపాలక సంఘాల్లో , 9 నగరపాలక సంస్థల్లో పోలీంగ్‌ జరుగుతూ ఉంది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌తో సహా కాంగ్రెస్‌, బిజెపి ఇతర పార్టీలన్నీ ఎక్కువ సీట్లు కైవసం చేసుకునేందుకు గెలుపే లక్ష్యంగా పోరాటం చేశాయి. బుధవారం జరుగుతున్న ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహఖ అధ్యక్షులు కేటీఆర్‌ పోలింగ్‌ వ్యూహాన్ని అమలు చేయాలని ఆ పార్టీ నేతలకు సూచించారు. ప్రతి ఓటూ కీలకమైందని... వీలైనంత ఎక్కువ పోలింగ్‌ జరిగేందుకు శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దావోస్‌ పర్యటనలో ఉన్న కేటీఆర్‌ మంగళవారం అక్కడి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో ఫోన్‌లో మాట్లాడారు. 'పార్టీ ప్రచారం విజయవంతంగా ముగిసింది. అయినా.. మితిమీరిన విశ్వాసం తగదు.. అన్ని విధాలా అప్రమత్తంగా, చురుగ్గా వ్యవహరించాలి. అభ్యర్థులు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించాలి. ఓటు వేసేందుకు వచ్చినందుకు ప్రజల్ని అభినందించాలి. పెద్ద ఎత్తున పోలింగ్‌ జరిగితే టిఆర్‌ఎస్‌కు విజయావకాశాలు ఎక్కువుగా ఉంటాయి. ఇందుకు అనుగుణంగా శ్రేణులు కృషి చేయాలి.' అని కేటీఆర్‌ సూచించారు. ఓటర్లకు ఇబ్బందులు లేకుండా పోలింగ్‌ కేంద్రాల సమాచారాన్ని అందించాలని పేర్కొన్నారు. ఏజెంట్లు అనుక్షణం అప్రమత్తంగా ఉండి... నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో 20 లక్షల మందికిపైగా టిఆర్‌ఎస్‌ కార్యకర్తలున్నారు. అభ్యర్థులు వారి సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కోరారు. కార్యకర్తలు కూడా ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని ఆకాంక్షించారు. 
ఈ ఎన్నికలను తెలంగాణభవన్‌ నుంచి పార్టీ సమన్వయ కమిటీ పర్యవేక్షించాలన్నారు. జిల్లాల్లో ఉండే మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలన్నారు.ఎక్కడైనా సమస్యలుంటే వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని, పార్టీ అంతర్గత అంశాలను వెంటనే పరిష్కరించుకునేందుకు చర్యలు చేపట్టాలని కేటీఆర్‌ సూచించారు. 

Post a Comment

0 Comments