కాంగ్రెస్‌, బిజెపిని గెలిపిస్తే అభివృద్ధి ఆగినట్టే

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్‌

రాజన్న సిరిసిల్ల : కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అభివృద్ధి శూన్యం అని, బిజెపిని గెలిపిస్తే మాటలు ఎక్కువు..పనులు తక్కువ అవుతాయని అభివృద్ధి ఆగుతుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్‌ వేముల వాడలో శనివారం ప్రసంగించారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడను అభివృద్ధి చేయాలని గత ప్రభుత్వాలు ఏనాడైనా ఆలోచన చేశాయా? అనే విషయాన్ని ఆలోచించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వేములవాడ పట్టణ అభివృద్ధి కోసం గుడి అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేసిన ఘనత టిఆర్‌ఎస్‌కే దక్కుతుందని కేటీఆర్‌ అన్నారు. రూ.218 కోట్ల నిధులు కేటాయించామని. విశ్రాంతి ఐఏఏస్‌ అధికారి ఆధ్వర్యంలో పట్టణంలో వివిధ రకాల పనులు కొనసాగుతున్నాయని వివరించారు.
జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రం మొత్తం అబ్బురపడేలా రాజన్న సిరిసిల్ల జిల్లాను అభివృద్ధి ఆగిపోతుందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ¬దా ఇవ్వని బిజెపికి ఎందుకు ఓటేయ్యాలని ప్రశ్నించారు. రాబోయే నాలుగేళ్లలో తెలంగాణలో పట్టణాలను దేశం ఆశ్చర్యపోయేలా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. పనిచేసే నాయకులకే ఓటు వేయాలని..ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు పనిచేయకపోతే వారిని తొలగిస్తామని కేటీఆర్‌ తేల్చి చెప్పారు. 

Post a Comment

0 Comments