అనంతపురం: విక్టరీ వెంకటేష్‌ కొత్త సినిమా 'నారప్ప' షూటింగ్‌ బుధవారం ప్రారంభమైంది. ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అనంతరం జిల్లాలో మొదలు పెట్టారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ  సినిమాకు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. 'బ్రహ్మత్సవం' తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న సినిమా ఇది. మంగళవారం రాత్రి విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు విశేషమైన స్పందన వచ్చింది. వెంకటేష్‌ ఇటీవల 'వెంకీమామ'తో హిట్‌ అందుకున్నారు. తమిళ హిట్‌ 'అసురన్‌'కు రీమేక్‌గా 'నారప్ప' తెరకెక్కుతోంది. మాతృకలో ధనుష్‌, మంజూ వారియర్‌ ప్రధాన పాత్రలో నటించారు. రీమేక్‌లో కథానాయక ఎవరో ఇంకా ప్రకటించలేదు. 

Post a Comment

Previous Post Next Post