కరీంనగర్‌ : 'నేను తియ్యటి హల్వాలాంటి వాణ్ని కాదని..ఎర్రటి కారం మిర్చిలాంటివాణ్ని' అని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో  భాగంగా నగరంలోని అశోక్‌నగర్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కేంద్రం తెచ్చిన సీఏఏపై రాహుల్‌గాంధీ, మమతాబెనర్జీతో కాదు..దమ్ముంటే అమిత్‌షా తనతో మాట్లాడాలని సవాల్‌ విసిరారు. సీఏఏ గురించి అవగాహన కల్పిస్తున్నానన్నారు. ముస్లింలు ఆపదలో ఉన్నప్పుడు ఏ లౌకిక పార్టీ పరామర్శించేందుకు రాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. సీఏఏ, ఎన్‌పీఆర్‌కు ఈ ఎన్నికలు రెఫరెండం అని పేర్కొన్నారు. కొంతమంది ప్రతిరోజూ తన పేరుతో చర్చాకార్యక్రమాలు నిర్వహిస్తూ టీఆర్పీలు పెంచుకుంటున్నాయన్నారు. అందుకు తనకేమీ ఇబ్బంది లేదన్నారు. కరీంనగర్‌లో పోటీ చేస్తున్న 10 మంది కార్పొరేటర్లు గెలిస్తేనే ఇక్కడ ఎంఐఎం బలమైన శక్తిగా ఎదుగుతుందని ఓవైసీ అన్నారు. ఈ సభకు పెద్ద ఎత్తున మైనార్టీలు, ఎంఐఎం కార్యకర్తలు వచ్చారు. 

Post a Comment

Previous Post Next Post