Monday, January 20, 2020

సీఎం సొంత జిల్లాలో మాస్టర్‌మైండ్స్‌ ఉగ్రవాదులు..!?

ఎంపీ హత్యకు, విధ్వంసానికి కుట్ర

కర్ణాటక : జనం రద్దీగా ఉన్న ప్రాంతాల్లో  రక్తపాతం సృష్టించేందుకు బాంబులు పేల్చేందుకు  ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు, ఓ వర్గానికి చెందిన ముఖ్యనేతలు హత్యలకు పథకం రూపొందించినట్లు పోలీసుల విచారణలో మహబూబ్‌ పాషా వెల్లడించాడు. సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు అతన్ని రహస్య స్థలంలో విచారించక భయానకమైన అంశాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. సీఎం సొంత జిల్లా శివమొగ్గ తీర్థహళ్లిలో ఇద్దరు మాస్టర్‌మైండ్స్‌ ఉన్నట్లు ఇతడు విచారణలో బయటపెట్టాడు. ఓ ఎంపీ హత్యకు, భారీ విధ్వంసానికి కుట్రపన్నినట్లు తెలియడంతో ఆరుగురుని గత శుక్రవారం బెంగుళూరు పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  ఈ ముఠాలో ముఖ్యమైన మహబూబ్‌పాషాను ఖాకీలు లోతుగా విచారిస్తున్నారు. ఇతడు చెప్పిన ఆధారాల పరంగా మాస్టర్‌మైండ్స్‌ కోసం సీసీబీ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
దక్షిణ భారతదేశంలోని ఐసిస్‌ ఉగ్రవాద సంస్థను బలోపేతం చేసేందుకు ఈ జీహాదీ గ్యాంగ్‌ పనిచేస్తోందని గుర్తించారు. 10 మొబైల్‌ సిమ్‌కార్డుల కొనుగోలు ఆధారంగా విచారణ చేపట్టి సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. కీలక నిందితుడు మహబూబ్‌పాషా ఐసిస్‌ దక్షిణ భారత కమాండర్‌గా గుర్తించారు. 2019 ఏప్రిల్‌లో తమిళనాడు హిందూనేత సురేశ్‌ హత్య కేసులో నిందితుడు అనుమానిత ఉగ్రవాది మోహినుద్దీన్‌ఖాజా జామీను తీసుకున్న అనంతరం పరారీలో ఉన్నాడు. సేలంలో మోహినుద్దీన్‌ ఖాజా శిష్యుడు ఒకరు నకిలీ పత్రాలు అందించి 10 సిమ్‌కార్డులు కొనుగోలు చేశాడు. ఈ సిమ్‌కార్డులు కోలారు, పశ్చిమబెంగాల్‌లోని  పనిచేస్తున్నట్లు పోలీసులు కనిపెట్టారు. తక్షణం ఐఎస్‌డీ, సీసీబీ పోలీసులు అప్రమత్తమై సుద్ధగుంటెపాళ్యంలోని ఓ ఇంటిలో మహబూబ్‌పాషా అనుచరుడిని అరెస్ట్‌ చేశారు. సీసీబీ, ఐఎస్‌డీ పోలీసులు అప్రమత్తమై జరగబోయే భారీ ముప్పు నుంచి తప్పించగలిగారు. 
మహబూబ్‌ పాషా యువకులనే నియమించుకుని వారికి శిక్షణనిచ్చేవాడు. శ్రీలంకలో గుడ్‌ఫ్రైడే నాడు చర్చిలు, ¬టళ్లలో జరిగిన బాంబుదాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులు ఈ ముఠాలో ఉన్నారనే అనుమానం వ్యక్తమౌతోంది. మహబూబ్‌ పాషా అరెస్టైన అనంతరం తీర్థహళ్లిలో ఉన్న ఇద్దరు మాస్టర్‌మైండ్స్‌ ఉడాయించినట్లు తెలిసింది. ఒక వర్గం యువకులను ఉగ్రవాద కార్యకలాపాలకోసం నియామకాలు, శిక్షణను మహబూబ్‌పాషా చూసేవాడు. చివరికి తన ఇద్దరు కుమారులను కూడా ఉగ్రవాద శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది. 


No comments:

Post a Comment