ఈ ఏడాది దేశ రాజధాని న్యూఢిల్లీలో జరగబోయే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర శకటం కనిపించడం లేదని తెలుస్తోంది. గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు సంబంధించిన బెంగాల్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన శకటాన్ని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. దీంతో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ , కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న వాతావరణం మరోసారి తెరపైకి వచ్చింది. గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు సంబంధించిన అన్ని రాష్ట్రాలు తమ శకట ప్రతిపాదనలను నిపుణుల కమిటీకి పంపిస్తాయి. శకటాల నేపథ్యం, ఇతివృత్తం, రూపకల్పన(డిజైన్‌), వీక్షకులపై పడే ప్రభావం తదితర అంశాల ఆధారంగా పరేడ్‌లో పాల్గొనబోయే శకటాలను ఎంపిక చేస్తారు. ఈ సారి బెంగాల్‌ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను నిపుణుల కమిటీ పరిశీలించింది. దీనిపై చర్చల అనంతరం బెంగాల్‌ శకటానికి రక్షణ మంత్రిత్వ శాఖ అభ్యంతరం తెలిపినట్టు తెలుస్తోంది. రిపబ్లిక్‌ డే పరేడ్‌ కోసం ఈ సారి 56 శకటాల ప్రతిపాదనలు రాగా, అందులో 22 మాత్రమే ఎంపిక అయ్యాయి. ఎంపికైన శకటాలలో 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినవి కాగా, 6 కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందినవి. తెలుగు రాష్ట్రాలతో పాటు అస్సాం, ఛత్తీష్‌ఘడ్‌, గోవా, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూకాశ్మీర్‌, కర్ణాటక, మధ్య ప్రదేశ్‌, మేఘాలయ, ఒడిశా, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్‌ శకటాలను కేంద్రం ఎంపిక చేసింది.

Post a Comment

Previous Post Next Post