Thursday, January 16, 2020

బిజెపి గూటిలోకి 'జనసేన'..!?

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుత మున్న ఉద్రిక్త పరిస్థితుల్లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన ప్రధాన  సమస్యగా రాజధాని నిర్మాణంపై  చర్చలు, నిరసనలు, ధర్నాలు  కొనసా గుతు న్నాయి. ఈ నేపథ్యంలో బిజెపి, జనసేన పార్టీలు కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యాయినేది తెలుస్తోంది. ఇరు పార్టీల ముఖ్యనేతలు ఇవాళ విజయవాడలో సమావేశమై ఉమ్మడి కార్యాచరణ ప్రకటించనున్నారు. అమరావతిలో రాజధాని కొనసాగింపు అంశమే తొలి పోరాట అజెండా కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బిజెపి కేంద్ర నాయకత్వం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, ఆ పార్టీ  రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ రాష్ట్రంలోని పరిస్థితుల గురించి చర్చించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏ ఆశయాలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారో... ఆ ఆశయాలకు రాష్ట్రంలో తూట్లు పడుతున్నాయని పేర్కొన్నారు. మూడు రాజధానుల అంశం, పెట్టుబడులు వెనక్కి  వెళ్లిపోవడం, అమరావతిలో 144 సెక్షన్‌ విధించడం, రైతుల సమస్యలు, మహిళలపై దాడుల గురించి ప్రస్తావించినట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైయస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, సామాన్యుల ఇబ్బందులపై వివిధ రూపాల్లో పవన్‌ విమర్శలు సంధిస్తూ వచ్చారు. ప్రస్తుతం రాజధాని మార్పు అంశంపై ప్రభుత్వ చర్యలు వేగవంతం అవుతున్న తరుణంలో... ఒంటరిగా పోరు సాగించే కంటే కేంద్రంలో అధికారంలోని బిజెపితో కలిసి వెళ్లడం మంచిదనే నిర్ణయానికి జనసేన పార్టీ వచ్చినట్లు తెలుస్తోంది. 
           జనసేనతో కలిసి నడవడంపై బిజెపి ముఖ్యనేతలు గురువారం ఉదయం విజయవాడలో భేటీ కానున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణతో పాటు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్‌ దేవ్‌ ధర్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో పాటు మరికొందరు ముఖ్యనేతలు మాత్రమే ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఢిల్లీ నాయకుల సూచనల మేరకు ఏఏ అంశాలలో కలిసి వెళ్లాలనే దానిపై ఇరుపార్టీల నేతలు చర్చించి  ఓ నిర్ణయానికి వస్తారు. ఈ విషయాన్ని కేంద్ర ¬ంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్తారు. అనంతరం రెండు పార్టీల నాయకులు ఉదయం 11 గంటలకు విజయవాడలోని ¬టల్‌ మురళీ ఫార్చ్యూన్‌లో సమావేశం కానున్నారు. జనసేన నుంచి పవన్‌ కల్యాణ్‌తో పాటు రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, ఒకరిద్దరు పీఏసీ సభ్యులు మాత్రమే హాజరవుతారు. రాజధాని అమరావతి అంశంపై ఉమ్మడి పోరు గురించి చర్చించనున్నారు. 

No comments:

Post a Comment