ప్రపంచంలో అతిఎక్కువుగా ముప్పును కలిగి ఉన్న ప్రముఖులు వీరే..!

ఈ ప్రపంచంలో రాజకీయ నాయకులకు, సినిమా తారలకు, ధనవంతులకు వ్యక్తిగత భద్రత లేనిదే వారు బయటకు అడుగు పెట్టరు. శత్రువులు, పోకిరిగాళ్ల  నుండి తప్పించుకునేందుకు వారు నిత్యం టెన్షన్‌..టెన్షన్‌గా జీవితాన్ని కొనసాగిస్తుంటారు. అదే విధంగా ప్రపంచంలోనే అతి ఎక్కువుగా ప్రాణ భయం (ముప్పను) కలిగి ఉన్న ప్రముఖులు కూడా ఉన్నారు. వారికి సెక్యురిటీ ఏకంగా వేల సంఖ్యలో పహారా కాస్తుంటారు. అదే విధంగా అత్యంత ఫవర్‌ఫుల్‌ బాడీ గార్డ్సు కలిగిన ప్రముఖులు ఎవరో ఇప్పుడు చూద్ధాం.
1. మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌.
 మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌.. సౌదీ అరేబీయా యొక్క యువరాజు.ఇతను పాపులారటీని బట్టి ఇతను కూడా ప్రపంచంలోనే  ఎక్కువ సెక్యురిటీని కలిగిఉన్నాడు. ఇతను సౌదీకి అత్యంత ఎకనామికల్‌ ఫవర్‌ఫుల్‌ వ్యక్తిగా ఉన్నాడు. ఈయన రాయల ఫ్యామిలీకి చెందినవాడు. అంతే కాకుండా ఇతను ఎక్కువుగా వివాదాలను కలిగిన వ్యక్తి కావడం వల్ల ముప్పు ఎక్కువుగా ఉంటుంది. ఇతను ఇంటర్నేషల్‌ పరంగా ఎక్కువుగా శత్రువులను కలిగి ఉన్నాడు. 2017లో ఇతను అధికారంలోకి రాగానే సౌదీకి చెందిన మిలటరీ మరియు సెక్యురిటీ ఏజెన్సీని కలిపి ఒక టీంని తయారు చేసుకున్నాడు. ఆ టీంలో దాదాపు 1000 మంది భద్రతా సిబ్బంది  ఉంటారు. ఆ టీం అంతా అతను ఎక్కడికి వెళ్లినా అక్కడకు వెళతారు. అతను ప్రయాణంలో దారి పొడవునా ఆ 1000 మంది సెక్యురిటీ కాపలా కాస్తుంటారు.  ఆ 1000 మందిలో సోల్జర్స్‌, సైబర్‌ సెక్యురిటీ కలిసి ఉంటారు. ఇతను రెండు సంవత్సరాలకే మిలటీరి మీద 20 బిలియన్స్‌ డాలర్స్‌ను ఖర్చు పెట్టాడు. 
2.క్వీన్‌ ఎలిజిబెత్‌. 
క్వీన్‌ ఎలిజిబెత్‌ యూకె దేశం యొక్క మహారాణి. ఈమె ఎక్కువుగా ప్రజలతో కలుస్తూ మమేకమై ఉంటుంది. అంతే కాకుండా ఈమెను ఎవ్వరూ టచ్‌కూడా చేయలేరు. దానికి ముఖ్య కారణం ఆమెకు ఉన్న సెక్యురిటీ సిబ్బంది. క్వీన్‌ ఎలిజిబెత్‌ ఈ ప్రపంచంలోనే ఉన్న అత్యంత ఉన్నతమైన ప్రముఖులలో ఈమె ఒకరు. అందుకనే ఆమెకు సెక్యురిటీ ఎక్కువ అవసరం. ఆమెకు సెక్యురిటీ కోసం పెద్ద టీం మే ఉంటుంది. ఆ టీం అత్యంత పటిష్ట భద్రతను ఇస్తుంది. సాధారణ టీంలా కాకుండా పబ్లిక్‌లో కలిసిపోయి ఆమెకు సెక్యురిటీగా కాపలా కాస్తుంటారు. అంతేకాకుండా ఆమెకు క్వీన్స్‌ గార్డ్స్‌ అనే సెక్యురిటీ సిబ్బంది కూడా ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా క్వీన్‌ ఎలిజిబెత్‌ను తప్పించేందుకు పక్కా ప్లాన్‌తో ముందుగానే సిద్ధంగా ఉంటారు. యూకెలోని క్వీన్‌ ఎలిజిబెత్‌తో పాటు మరికొంత ప్రముఖులు కూడా ఉన్నారు. వారు వెళ్లేటప్పుడు రహదారి మొత్తం ఖాళీ చేస్తూ పైన హెలికాప్టర్లతో కూడా పహారా కాస్తుంటారు. 
3.నరేంద్ర మోడీ.
 ప్రపంచంలోనే అతిఎక్కువ జనాభా కలిగిన దేశాల్లోని ఇండియా రెండో స్థానంలో ఉంటుంది. అలాగే ఇండియాలో ప్రధానమంత్రి మోడీకి ప్రజాదారణ కూడా ఎక్కువుగానే ఉంది. అలాగే శత్రువులు కూడా మోడీకి ఎక్కువుగానే ఉన్నారు. దేశవిధాల్లో కూడా మోడీకి శత్రువులు ఎక్కువు మందే ఉన్నారు. పిఎం మోడీకి సెక్యురిటీ ఎక్కువగానే ఉంది. సెక్యురిటీ సిబ్బందిలో ఎస్‌పిజి కమెండోస్‌(స్పెషల్‌ ప్రొటక్షన్‌ గార్డ్స్‌) 24 గంటలూ మోడీకి సెక్యురిటీగా ఉంటారు. అలాగే ఢిల్లీ పోలీసులు కూడా సెక్యురిటీగా ముఖ్యమైన పాత్రను వహిస్తారు. మోడీ సెక్యురిటీ విభాగంలో 500లకు పైగా ఎస్‌పిజి కమెండోస్‌, ఇతర ఆఫీసర్లు, గార్డులు ఉంటారు. మరియు పిఎం కాన్వాయ్‌లో 8 బిఎండబ్ల్యూలు, ఒకటి మార్సిటిజ్‌ బెంట్‌ అంబ్యులెన్స్‌, కొన్ని ఇతర కార్లు కూడా ఉంటారు.
4.కిమ్‌ జాంగ్‌-ఉన్‌
ఇతను నార్త్‌ కొరియా యొక్క రాజు. ఇతన్ని ఒక పిచ్చి నియంతా అని కూడా అంటారు. అతను చేసే పిచ్చి పనుల వల్ల ప్రపంచమంతా అతనికి అనేక మంది శత్రువులు ఉన్నారు. ప్రపంచంలోనే అనేక దేశాలు ఇతనికి శత్రువులుగా ఉన్నాయి. జపాన్‌,సౌత్‌ కొరియా వంటి దేశాలు ఈ దేశానికి బద్ధ శత్రువులు. కిమ్‌ జాంగ్‌-ఉన్‌కి శత్రువులు ఎక్కువుగా ఉండటం వల్ల భయం ఎక్కువ. అందువల్ల అతనికి సెక్యురిటీ కోసం ప్రపంచంలోనే ఎవ్వరూ పెట్టుకోలేనంత మంది సెక్యురిటీ గార్డ్సుని పెట్టుకున్నాడు. 2017లో అమెరికా-సౌత్‌ కొరియా కలిసి ఇతన్ని చంపుతారనే సమాచారం కిమ్‌ జాంగ్‌ వద్దకు వచ్చింది. ఆ దెబ్బతో కిమ్‌ జాంగ్‌-ఉన్‌ మరింత అప్రమత్తమయ్యాడు. అతని చుట్టూ ఎప్పుడూ మార్షల్‌ ఆర్ట్స్‌ టీం సిబ్బంది ఉంటారు.ఆ టీం అతని కారు వెనుకాలా ఎప్పుడూ పరిగెడుతూ ఉంటుంది. కిమ్‌ జాంగ్‌ - ఉన్‌ కారు ఎప్పుడైతే స్లో అవుతుందో ఆ టీం అంతా ఆ కారు చుట్టూ చేరుకుంటారు. అతని సెక్యురిటీ కోసం దాదాపు 80 వేల మందిని నియమించుకున్నాడు.
5.వ్లాదీ మీరి పుతీన్‌
ఈ ప్రపంచంలోనే అతి పెద్ద దేశానికి  రష్యాకి అధ్యక్షుడిగా ఇతను పనిచేస్తున్నాడు. మరి అంత పెద్ద దేశానికి కూడా శత్రువులు ఉంటారు. దాని కారణంగానే అతనికి కూడా సెక్యురిటీ ఎక్కువుగానే ఉంటుంది. ఇతని సెక్యురిటీలో కమెండోస్‌, గార్డ్సు ఉంటారు. ఇతని యొక్క సెక్యురిటీ చాలా చురుకుగా ఉంటుంది.2000 మంది గార్డ్సు ముందుగానే ప్రజల్లో కలిసిపోయి పహారా కాస్తుంటారు. మరియు అతని వెళ్లే రహదారిలో 500 మంది సెక్యురిటీ కాపలా కాస్తుంటారు. మరియు అతని సెక్యురిటీ కోసం ఒక డిపార్టుమెంట్‌ డ్రోన్స్‌తో నిత్యం మెలుకువతో పనిచేస్తుంది. దాదాపు 10,000 వేలకు పైగా పుతీన్‌కు సెక్యురిటీ గార్డ్సు ఉన్నారు.
6.ప్రిన్స్‌ హారీ-మేఘన్‌ మార్కల్‌
ఇతను బ్రిటీష్‌ ప్రిన్స్‌. ఈ దంపతుల కొంత ఇంట్లో సెక్యురిటీ కోసం దాదాపు 65 మిలియన్‌ డాలర్లను ప్రిన్స్‌ హారీ ఖర్చు చేశాడు. ఇతని భార్యతో కలిసి లండన్‌కు సమీపంలో కొద్దిదూరంలో నివశిస్తుంటాడు. వారు ఉండే ఇల్లు ఒక చిన్న కోటలా ఉంటుంది. మరియు అక్కడ సెక్యురిటీ కూడా కోటలోని సెక్యురిటీ లానే ఉంటారు. అడుగడుగునా కెమెరాలు, సెన్సార్స్‌ అమర్చబడి ఉంటాయి. ఎక్కడపడితే అక్కడ డ్రోన్స్‌ కెమెరాలు సెక్యురిటీ కోసం ఎగురుతూ పహారా కాస్తూ ఉంటాయి. వారి వ్యక్తి గత భద్రత కోసం దాదాపు 1000 మంది బ్రిటీష్‌ సైనికులు అక్కడ కాపలా కాస్తుంటారు.

7.బిల్‌గెట్స్‌
బిల్‌గెట్స్‌ ఈ ప్రపంచంలోనే అత్యంత ధనమున్న సంపన్నులలో ఒకరు.  బిల్‌గెట్స్‌ వల్ల ప్రపంచంలోనే ఎంతో కొంత ఆర్థిక ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఇతను 1980లో మైక్రోసాప్ట్‌ కంపెనీని సృష్టించి అత్యంత వేగంగా దూసుకుపోతున్న సాఫ్టవేర్‌ను నెలకొల్పాడు. 1988లో కొంత మంది ఫ్రాంక్‌ చేసే వ్యక్తులు  బిల్‌గెట్స్‌మీద కేక్‌తో ఎటాక్‌ చేశారు. అప్పటి నుండి బిల్‌గెట్స్‌ ఎంతగానో భయపడ్డారు. ఆ ఘటన తర్వాత బిల్‌గెట్స్‌ కొత్త ఆఫీస్‌ను ప్రారంభించి దానిని బుల్లెట్‌ప్రూఫ్‌ గ్లాసులతో నిర్మించుకున్నాడు. అతన్ని ఎవరైనా కలవాలనుకున్నా గానీ అనేక సెక్యురిటీ సిస్టమ్స్‌ను దాటి వెళ్లాలి. అంతే కాకుండా మైక్రోసాప్ట్‌లో పనిచేసే కొంత మంది మాజీ ఉద్యోగుల నుంచి కూడా  ఎటాక్‌ ప్రభావాన్ని చవిచూశాడు. దానితో తన సెక్యురిటీ సిబ్బందిని అమాంతం పెంచేశాడు. బిల్‌గెట్స్‌కు సెక్యురిటీ కోసం కంపెనీ పెద్ద సెక్యురిటీ టీంను ఏర్పాటు చేసింది. అతను ఎటువెళ్లినా అతని పర్సనల్‌ సెక్యురిటీతో పాటు, గవర్నమెంట్‌ కూడా కమెండోస్‌ను సెక్యురిటీని ఏర్పాటు చేసి పహారా కాస్తుంది. 
8.మార్స్క్‌ జూకర్‌ బర్గ్‌ 
ఇతను ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు. ప్రస్తుతం ఇతను సిఇఓగా వ్యవహరిస్తున్నాడు. ప్రపంచంలోనే టాప్‌ 10 ధనవంతుల్లో ఇతను ఒకడు. ప్రపంచంలోనే సెక్యురిటీకోసం అతి ఎక్కువుగా ఖర్చు పెట్టే సిఈఓల్లో ఇతను ఒకడు.2017లో జూకర్‌ బర్గ్‌ సెక్యురిటీ కోసం 7.3 మిలియన్‌ డాలర్స్‌ను ఖర్చు పెట్టాడు. 2018లో సెక్యురిటీ కోసం 20 మిలియన్‌ డాలర్స్‌ను(రూ.140 కోట్లు) ఖర్చు పెట్టాడు. అతని ఇంటి వద్ద ఎప్పుడూ అత్యంత పటిష్టమైన సెక్యురిటీ గార్డ్సు పహారా కాస్తుంటారు. ఆయన వ్యాయామం కోసం బయటకు వెళ్లినప్పుడు ఆయన తో పాటు కొంత మంది బాడీ గార్డ్సు కూడా ఉంటారు. ఆయన ఇంట్లో ఒక రహస్యమైన గది కూడా ఉంది. ఎమర్జన్సీ సమయంలో ఆయన ఆ రూంలోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకోవచ్చు. జూకర్‌ బర్గ్‌ ఏ ప్రాంతానికి వెళతాడో అంతకన్న ముందే ఆయన బాడీగార్డ్సు అక్కడకు వెళ్లి తనికీలు చేసుకుంటారు.








Post a Comment

0 Comments