Wednesday, January 29, 2020

మళ్లీ తెరపైకి 'మల్లన్న సాగర్‌' కేసు

హైదరాబాద్‌ : మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు బుధవారం ప్రభుత్వంలో ఉన్న అధికారులకు జైలు శిక్ష, జరిమాన విధించింది. 2018లో  మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు విషయంలో రైతుల అభ్యంతరాలు వినకుండా అధికారులు డిక్లరేషన్‌, అవార్డును ఇచ్చారని బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. గతంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను రైతులకు తెలపాలని, అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోని విచారణ జరిపి ఆర్డర్‌ను రైతులకు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. 
అయితే 2019 మేలో హైకోర్టు ఆదేశాలను పాటించకుండా అధికారులు డిక్లరేషన్‌, అవార్డును ప్రకటించారని మరోసారి రైతులు కోర్టు మెట్లు ఎక్కారు. బుధవారం ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు సిద్ధిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, సిరిసిల్ల కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌కు రూ.2 వేలు జరిమానా విధించింది. ఒక వేళ నాలుగు వారాల్లో జరిమానా చెల్లించకపోతే ఒక నెల జైలు శిక్ష పడుతుందని కోర్టు హెచ్చరించింది. అదే విధంగా సిద్ధిపేట ఆర్‌డీఓ జయచందర్‌రెడ్డికి రెండు నెలల జైలు శిక్షతోపాటు రూ.2 వేలు జరిమానాను హైకోర్టు విధించింది. దీంతోపాటు 12 మంది పిటిషనర్లకు రూ.2 వేల చొప్పున అధికారాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. 

No comments:

Post a Comment