వైరల్‌ : కారులో డ్రైవర్‌.. ప్రక్కన ఓ..అస్థిపంజరం..!

అమెరికా: ప్రపంచంలో వాహన దారులు ట్రాఫిక్‌ నిబంధ నలు పాటించడం ప్రక్కన పెడితే.. వాటిని ఎలా తప్పించు కోవాలన్న దానిపైనే ఆసక్తి చూపిస్తుంటారు చాలా మంది. మనం చెప్పుకునే ఈ వ్యక్తి  మాత్రం కాస్త డిఫరెంట్‌గా ఆలోచిం చాడులేండి..! వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని అరిజోనాకు చెందిన ఓ 65 ఏళ్ల వ్యక్తి కారు నడుపు కుంటూ వెళుతున్నాడు. అలా అతను కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉండే హెచ్‌ఓవీ ప్రదేశానికి వచ్చాడు. అయితే ఆ ప్రదేశంలోకి ఎంటర్‌ అవ్వాలంటే వాహనం నడిపే వ్యక్తితో పాటు మరొకరు ఉండాల్సిందే. ఒక్కరు మాత్రం ఆ రోడ్డు గుండా వెళ్లడానికి ఆ వాహనాలను అనుమతించరు. 
దీంతో అతను తనతోపాటు మనిషిని వెంట తీసుకెళ్లకుండా ఓ అస్థిపంజరాన్ని పట్టుకెళ్లాడు. దాన్ని కారులో ముందు సీటులో కూర్చోబెట్టి సీట్‌బెల్ట్‌కు బదులు తాడు కట్టి, పుర్రెకు టోపీ పెట్టి ప్రయాణం చేస్తూ వచ్చాడు. ఇది అక్కడి అధికారుల కంట పడింది. అంతే.. అతని వాహనాన్ని అడ్డుకున్నారు. ఇక అస్థిపంజరాన్ని చూసి నోరెళ్లబెట్టిన అధికారులు దాన్ని ఫొటోతో సహా ట్విట్టర్‌లో షేర్‌ చేసి ఈ విషయాన్నంతా పూసగుచ్చినట్లుగా చెప్పారు. కాగా ప్రయాణికుడిలా కారులో దర్జాగా కూర్చొన్న అస్థిపంజరం ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తెగ కామెండ్లు పెడుతున్నారు. 


Post a Comment

0 Comments