కాంగ్రెస్‌ తీసి పారేసే పార్టీ కాదు.. మా ప్రత్యర్థినే..!
ఇష్టాగోష్టిలో మంత్రి కేటీఆర్‌
తెలంగాణ రాష్ట్ర సమితి 2020లో పురపాలక ఎన్నికల్లో విజయంతో శుభారంభం చేస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రికేటీఆర్‌ రామారావు చెప్పారు. ఈ దశకం టిఆర్‌ఎస్‌దేనని.. 2020 నుంచి 2030 వరకు తమ ప్రభుత్వమే వస్తుందని జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా ఎదుగుతుందన్నారు. కొత్త పురపాలక చట్టం సమర్థంగా అమలు చేయడమే లక్ష్యమని తెలిపారు. రాజకీయాల్లో తమకు శత్రువులెవ్వరూ లేరన్నారు. ఉన్నదల్లా ప్రత్యర్థులేనని తెలిపారు. కాంగ్రెస్‌ తీసి పారేసే పార్టీ కాదని, పురపాలక ఎన్నికల్లో దానినే ప్రత్యర్థిగా భావిస్తున్నామన్నారు. తన  బాల్యంలో బీజేపీ ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉందన్నారు. 5 ట్రిలియన్‌ డాలర్ల కేంద్ర ప్రభుత్వ కల సాకారం కావాలంటే ప్రగతిశీల రాష్ట్రాలను ప్రోత్సహించాలని కేటీఆర్‌ సూచించారు. కేంద్రం సాయం చేయకపోయినా ఐటిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. సంక్రాంతి తర్వాత పార్టీ కార్యాలయాలను ప్రారంభిస్తామన్నారు. మరో పదేళ్లు సీఎంగా ఉంటానని కేసీఆర్‌ ప్రకటించారని, ఇప్పుడు తాను సీఎం అవుతాననే చర్చ అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 
2019 మాకు  బ్రహ్మాండమైన ఆరంభం ఇచ్చింది. శాసన సభ ఎన్నికలను గెలిచి రెండో సారి అధికారంలోకి వచ్చాం. పార్లమెంటు ఎన్నికల్లో తొలిస్థానంలో నిలిచాం. 90 శాతం గ్రామ పంచాయతీలను గెలిచాం. మొత్తం 32 జిల్లా పరిషత్‌లను చేజిక్కించుకున్నామన్నారు. 2020 ని సైతం పురపాలక ఎన్నికల్లో ఘన విజయం తో ప్రారంభిస్తామన్నారు. ఈ నెల మొదటి వారంలో కేసీఆర్‌ అధ్యక్షతన శాసనసభా పక్షం, రాష్ట్ర కమిటీల ఉమ్మడి సమావేశం ఉంటుందన్నారు. పురపాలక ఎన్నికలకు పార్టీ సమాయత్తంపై శ్రేణులకు సీఎం దిశానిర్ధేశం చేస్తామన్నారు. పార్టీ కార్యానిర్వాహక అధ్యక్షుడిగా ఈ ఏడాది పూర్తి సంతృప్తినిచ్చిందన్నారు. 60 లక్షల మందితో సభ్యత్వ నమోదు, కమిటీల నిర్మాణం పూర్తి చేసుకున్నామన్నారు.
వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవడంలో కేసీఆర్‌ను మించిన వారు లేరు. ఆర్‌టిసి కార్మికుల సమ్మె చేశారు. తర్వాత వారేజేజేలు కొడుతున్నారన్నారు. ఎన్‌పిఆర్‌, ఎన్‌ఆర్‌సి విషయంలో పార్టీ నిర్ణయం కంటే ప్రభుత్వ నిర్ణయమే ముఖ్యమని అందరితో  మాట్లాడి సీఎం ఓ నిర్ణయం తీసుకుంటారన్నారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో మాకు సత్సంబంధాలున్నాయన్నారు. జగన్‌తోనే కాదు, చంద్రబాబు ఉన్నప్పుడూ కొనసాగయన్నారు. మేము యాగం చేసినప్పుడు ఆయనను పిలిచాం, రాజధాని శంకుస్థాపనకు ఆయన పిలిచారన్నారు. 
పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తేలికగా తీసుకోమన్నారు. ఉత్తమ్‌ టీపీసీసీ అధ్యక్షుడిగా ఉంటారా లేదా అనేది ఆయన వ్యక్తిగతం. ఒక ఐపీఎస్‌ అధికారిని ఆయన దూషించడం సరైంది కాదన్నారు. హైదరాబాద్‌లో సీఎఎ అనుకూల, వ్యతిరేక ర్యాలీలు జరిగాయిని, కాంగ్రెస్‌ వారు ర్యాలీకి ఎంచుకున్న ప్రాంతం సరైందని కాదని సూచించారు. 
తెలంగాణకు నౌకాశ్రయాల అవసరం ఉంది. బందరు ఓడరేవు సేవలను ఉపయోగించుకోవాలని అనుకున్నాం. గోదావరి, కృష్ణా నదులపై జలమార్గాలు ప్రారంభమైతే భద్రాచలానికి నౌకలు వస్తాయి. అప్పుడు మనకు ఇతర రాష్ట్రాల నౌకాశ్రయాలతో పనుండదన్నారు. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ విస్తర్ణ ఉంటుందన్నారు. పాత నగరానికి మెట్రోని విస్తరిస్తామన్నారు.   

Post a Comment

Previous Post Next Post