Monday, January 20, 2020

6 ఓట్లు ఉంటే...ద్విచక్రవాహనం..!

రాజధాని శివారుల్లో 'మున్సిపల్‌' ఎన్నికల ఆఫర్‌ - నేటితో ముగియున్న ప్రచారం

హైదరాబాద్‌ : మున్సిపల్‌ ఎన్నికల ¬రా¬రీ ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఇప్పటికే సర్వశక్తులొడ్డిన నేతలు తర్వాత అస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. సోమవారం సాయంత్రం నుంచి చివరి వ్యూహాలను అమలు చేయనున్నారు. ప్రలోభాల పర్వానికి శ్రీకారం చుట్టనున్నారు. గతంలో వరుస విజయాలతో కొనసాగిస్తున్న టిఆర్‌ఎస్‌ పార్టీ మున్సిపల్‌ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఆరంభం నుంచి పక్కాగా ఎన్నికల ప్రచార వ్యూహాన్ని అమలు చేయగా కాంగ్రెస్‌, బిజెపిలు కూడా సత్తాచాటాలని చివరి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. రాష్ట్రంలో ఈ నెల 22న 120 మున్సిపల్‌ సంఘాలు, 9 నగర పాలక సంస్థల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. గడువు సమీపిస్తుండటంతో ఓ వైపు ప్రచారం ¬రెత్తుతుండగా ప్రలోభాలు అదే స్థాయిలో ఉంటున్నాయి.
గతంలో ఇంటింటికి తిరిగి డబ్బు, మద్యం, ఇతర సామాగ్రి అందించేవారు. ఇప్పుడు ప్రచారానికి, ఎన్నికలకు మధ్య సమయం తక్కువుగా ఉండటంతో ఓటర్లను బుట్టలో వేసుకోవాలనే కొత్త ప్రణాళికల్లో అభ్యర్థులున్నారు.  ఓటు వేపించుకునేందుకు పక్కాగా తీర్మానం చేయించుకుంటూ భారీ ప్రలోభాలకు ఎర వేస్తున్నారు. హైదరాబాద్‌ నగర శివారు కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో కొత్త పద్ధతులు ఎంచుకున్నారు. 
బండ్లగూడ జాగీర్‌లోని ఓ డివిజన్‌ నుంచి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీ అభ్యర్థి తన డివిజన్‌ పరిధిలోని బస్తీలో ఎక్కువుగా ఉన్న ఓ సామాజిక వర్గం ఓటర్లను మచ్చిక చేసుకోవాలనే ఉద్ధేశంతో ఓటుకు రూ.10 వేలు వరకు ఇవ్వాలని నిర్ణయించకున్నారట.  మరో డివిజన్‌లో ఆరు ఓట్లుంటే ఇంటికి ఓ ద్విచక్రవాహనాన్ని ఇవ్వాలని ఓ అభ్యర్థి నిర్ణయించుకున్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలైన రోజునే 100 ద్విచక్ర వాహనాలు బుక్‌ చేశారని తెలిసింది. పీర్జాదిగూడలో ప్రధాన పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి ఇప్పటికే రూ.10 కోట్లు ఖర్చుపెట్టినట్లు సమాచారం. ఆదిభట్ల మున్సిపాలిటీలోని ప్రధాన పార్టీ అభ్యర్థి ఒకరు రూ.లక్షలు ఖర్చు పెట్టి ఓటర్లను విహారయాత్రలకు పంపించారు. కాలనీవాసులందరి ఓట్లను వేయించుకోవాలన్నది ప్రణాళిక, రెండుకు పైగా ఓట్లు ఉంటే ఇంటికి తులం బంగారం ఇవ్వాలని మరో అభ్యర్థి నిర్ణయించకున్నారట.
5 గంటల తర్వాత ప్రచారం బంద్‌...
సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి 22న ఎన్నికలు జరిగే పుర, నగర పాలక సంస్థల్లో ఎలాంటి ఎన్నికల ప్రచారం చేయకూడదని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 24న పోలీంగ్‌ జరిగే కరీంనగర్‌ కార్పొరేషన్‌లో 22వ తేదీ సాయంత్రం ఐదుగంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుందని స్పష్టం చేసింది. ఎన్నికల సభలు, సమావేశాలు పెట్టడం, ర్యాలీలు నిర్వహించడం, టీవీలు, సినిమాహాళ్లలో ప్రచారం, ఎన్నికల ప్రచారంలో భాగంగా మ్యూజికల్‌నైట్‌ సహా ఎలాంటి వినోద కార్యక్రమాలు నిర్వహించకూడదని ఉత్తర్వులో ఎన్నికల సంఘం పేర్కొంది. 

No comments:

Post a Comment