డెత్‌ వారెంట్‌ ప్రకారం.. 48 గంటల్లో 'ఉరి'..!?

ఢిల్లీ: మరో 48 గంటల్లో అనగా..ఫిబ్రవరి 1వ తేదీన కోర్టు తీర్పు ప్రకారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'నిర్భయ' ఘటన కేసులో దోషులకు ఉరిశిక్ష పడాల్సి ఉంది. దోషులు ఉరి నుండి తప్పించుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి చివరికి విఫలమయ్యారు. నిర్భయ దోషి అక్షయ్‌కుమార్‌ వేసుకున్న క్యురేటివ్‌ సుప్రీం కోర్టు తిరస్కరించింది. అలాగే ఫిబ్రవరి 1న ఉరిశిక్షపై స్టే విధించాల్సిందిగా కోరుతూ అతడు వేసిన మరో పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. మహిళలపై హింసకు సంబంధించిన కేసుల్లో ప్రజల నుంచి ఎదురయ్యే ఒత్తిడి, ప్రజాభిప్రాయాలను అనుసరించి కోర్టులు సర్వరోగ నివారణిగా దోషులకు మరణశిక్ష విధిస్తున్నాయని అక్షయ్‌ తన క్యురేటివ్‌ పిటిషనల్‌ పేర్కొన్నాడు.
అతడి పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ అరుణ్‌మిశ్ర,జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌, నారీమణ్‌, జస్టిస్‌, ఆర్‌.భానుమతి, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం ప్రత్యేక ఛాంబర్‌లో విచారణ జరిపింది. అక్షయ్‌కు ఇంకా క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. నిర్భయ దోషులను ఫిబ్రవరి 1న ఉరితీయాల్సిందిగా ఢిల్లీ కోర్టు ఇటీవల రెండోసారి డెత్‌వారెంట్‌ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే శిక్ష అమలును ఆపేందుకు దోషులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. తాజాగా నిర్భయ దోషులు ఉరిశిక్ష అమలుపై స్టే విధించాల్సిందిగా ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ ఈరోజు సాయంత్రం చేపట్టనున్నారు. ఈ కేసులోని మరోదోషి వినయ్‌శర్మ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకున్నాడు. అది ఇంకా పెండింగ్‌లోనే ఉంది. దీంతో నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు మరింత ఆలస్యం కానుంది. ఈ కేసులో మరో దోషి ముఖేష్‌కు ఉన్న న్యాయపరమైన అవకాశాలన్నీ అయిపోయాయి.  


Post a Comment

0 Comments