Monday, January 20, 2020

ఒక్క పోలీస్‌..30 మందితో సమానం..!

ముంబాయి: సుమారు 88 ఏళ్ల తర్వాత ముంబాయిలో పోలీసులు గుర్రాలపై గస్తీ కాయనున్నారు. ఈ మేరకు ప్రత్యేక పోలీసు దళాన్ని ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ¬ంశాఖ నిర్ణయించింది. ట్రాఫిక్‌, జన సామర్థ్యం ఎక్కువుగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు గుర్రాలపై గస్తీ కాయనున్నారని ఆ రా ష్ట్ర ¬ంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ వెల్లడించారు. ఈ తరహౄ విధానం 1932కు ముందు ఉండేది.  నగరంలోని  పెరుగుతున్న వాహనాల రద్ధీ దృష్ట్యా దీన్ని అప్పట్లో రద్దు చేశారు. ''ముంబాయి పోలీసుల విభాగంలో నేడు అత్యాధునిక జీపులు, మోటార్‌సైకిళ్లు ఉన్నాయి. అయినా రద్ధీ ఉన్న ప్రాంతాల్లో గస్తీ  కాసేందుకు గుర్రాలతో కూడిన పోలీసుల బృందాలు అవసరం అని తేల్చాం. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ముంబాయిలో ఈ తరహా విధానాన్ని అమల్లోకి తీసుకురావడం ఇదే తొలిసారి'' అని అనిల్‌ వివరించారు. పండుగలు, ప్రత్యేక రోజుల్లో జరిపే ర్యాలీలు, ప్రదర్శనల సమయంలో గుర్రాలపై గస్తీ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని అనిల్‌ తెలిపారు. ఎక్కువ ఎత్తులో ఉండటం వల్ల నిఘా సులభం అవుతుందన్నారు. గుర్రంపై ఎక్కి విధులు నిర్వర్తించే ఒక్క పోలీసు నేలపై ఉండే 30 మందితో సమానమని అభిప్రాయపడ్డారు. పుణే, నాగ్‌పూర్‌ వంటి నగరాల్లోని ఈ విధానాన్ని అమల్లోకి తెస్తామన్నారు. ప్రస్తుతం 13 గుర్రాలు ఉన్నాయని ఆరునెలల్లో ఆ సంఖ్యను 30కి పెంచుతామని తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న ఈ దళంలో ఓ ఎస్సై, ఒక అసిస్టెంట్‌ పీఎస్‌లు, నలుగురు హవల్దార్లు, 32 మంది కానిస్టేబుళ్లు ఉంటారని పేర్కొన్నారు. 

No comments:

Post a Comment