2020 Funny Videos | Viral Videos Of 2020 Caught On Camera |కెమెరాలో రికార్డైన వైర‌ల్ వీడియోలు

2020 Funny Videos | Viral Videos Of 2020 Caught On Camera |కెమెరాలో రికార్డైన వైర‌ల్ వీడియోలు2020 సంవ‌త్స‌రం ప్ర‌పంచానికి చేదును రుచి చూపించి వెళ్లింది. అదే విధంగా కాస్త కొత్త‌ద‌నం, కాస్త ఫ‌న్నీ మూమెంట్స్‌ను కూడా మ‌ధ్య‌మ‌ధ్య‌లో అందించింది. లాక్‌డౌన్ వ‌ల్ల అంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమితం అవ్వ‌డం వ‌ల్ల కుటుంబంతో కొన్ని నెల‌ల పాటు సంపూర్ణంగా గ‌డిచే అవ‌కాశం వ‌చ్చింది. అదే సంద‌ర్భంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా టిక్‌టాక్‌, ఫేసుబుక్‌, ట్విట్ట‌ర్ లాంటి యాప్‌లు ప్ర‌పంచంలో జ‌రుగుతున్న విషాద‌క‌ర సంఘ‌ట‌న‌ల‌తో పాటు, న‌వ్వు తెప్పించే వీడియోలు కూడా మ‌న ముందుకు వ‌చ్చాయి. ఇక 2021 నూత‌న సంవ‌త్స‌రంలో అడుగు పెట్టినంక 2020 ని ఎవ్వ‌రూ గుర్తు చేసుకోకుండా ఉండాల‌నే చూస్తారు. కానీ విషాదాన్ని మ‌రిచి పోయి ఫ‌న్నీని మాత్రం గుర్తు చేసుకుందాం.

2020 Funny Videos

2020 అక్టోబ‌ర్ 18న ట్విట్ట‌ర్‌లో ఓ వీడియో అప్‌లోడ్ చేశారు. ఇది చాలా వైర‌ల్ అయ్యింది. ఓ డాక్ట‌ర్ హృత్రిక్ రోష‌న్‌, టైగ‌ర్ షాప్ న‌టించిన వార్ సినిమాలోని గుంగురు టూటూగై పాట‌కు సూప‌ర్ డాన్స్ వేశారు. silchar medical college Assam లో ENT Docter Arup Senapati పిపిఈ కిట్‌తో డాన్స్ వేస్తూ ఉంటారు. అత‌ని ఫ్రెండ్ Dr.Syed Faizan Ahmad ఈ వీడియో తీశారు. వీడియోను ట్విట్ట‌ర్ లో పోస్టు చేసి ఇది క‌రోనా రోగుల‌కు Docter Arup Senapati డెడికేట్ చేశారు చూడండి అంటారు. త‌ర్వాత ఈ వీడియో చూసిన మాధురీ దీక్ష‌త్‌, హృత్రిక్ రోష‌న్ ఫిదా అవుతారు. డాక్ట‌ర్ అనురూప్‌కు చెప్పండి నేను ఆ డ్యాన్స్ నేర్చుకుంటాన‌ని హృత్రిక్ రోష‌న్ ట్విట్ చేశారు.

2020 Funny Videos

త‌మిళ‌నాడు రాష్ట్రంలో తిరువూరు పోలీసులు 2020లో క‌రోనా ఎక్క‌వుగా ఉన్న స‌మ‌యంలో లాక్‌డౌన్ ఎవ్వ‌రూ పాటించ‌డం లేద‌ని ఓ వినూత్న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఎంత చెప్పినా మాస్కు పెట్టుకోవ‌డం లేద‌ని, రోడ్ల‌పైకి విచ్ఛ‌ల‌విడిగా తిరుగుతున్నార‌ని రోడ్డుపైన ఒక అంబులెన్స్ పెట్టుకొని పోలీసులు కాప‌లా కాశారు. ఇంత‌లో రెండు ద్విచ‌క్ర వాహ‌నాలపై న‌లుగురు కుర్రాళ్లు వ‌స్తారు. వాళ్ల‌ని పోలీసులు ఆపి క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌రా మీరు.. అంటూ ఓ ముగ్గుర్ని అంబులెన్స్ ఎక్కిస్తారు. అందులో ఫేక్ క‌రోనా ఫేషెంట్ ఉండ‌టంతో నిజ‌మైన క‌రోనా పేషెంట్ అనుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. ఈ వీడియో చూస్తుంటే బాగా కామెడిగా ఉంటుంది. నిజానికి పోలీసులు చేసిన ఈ ప్ర‌య‌త్నం ఫ‌న్నీగా ఉన్నా క‌రోనా అంటే భ‌య‌మేమిటో చూపించారు.

2020 Funny Videos

క‌రోనా ఎవ‌రికి మేలు చేసిదంటే కేవ‌లం బ‌డి అంటే ఇష్టం లేని పిల్ల‌ల‌కి మాత్ర‌మే. 2020లో పిల్ల‌లు ఆడిందే ఆట‌, పాడిందే పాట‌గా మారింది. స్కూళ్లు లేవు, హోంవ‌ర్కు లేదు, ఏడవ‌టాలు, మారం చేయ‌డాలు అస్స‌లు లేవు. చూస్తే టివి, ప‌ట్టుకుంటే ఫోన్ ఈ రెండే వారి టైం పాస్ కు ఆయుధాలుగా మారాయి. పిల్ల‌లు టివి చూసి చాలా నేర్చుకుంటారు. అయితే ఓ పాప అలా నేర్చుకుంటూనే తెలియ‌కుండానే ఓ ప‌ని చేసింది. టివిలో త‌మిళం పాట వ‌స్తున్న‌ది చూసి ఇంటిలో ఆ పాట‌కు త‌గ్గ‌ట్టుగా స్టెప్పులు వేస్తూ ఉంటుంది. ఇదే సంద‌ర్భంలో ఆ పాట‌లో హీరోయిన్ బ‌స్సులోని పైన ఉన్న గ్రిల్ ప‌ట్టుకొని వేలాడుతుంది. ఇది చూసిన పా కూడా వేలాడుదామ‌ని టివికి వేలాడ‌టంతో అది నేల మీద ప‌డింది. అదృష్టం శాత్తు టివి ప‌గిలినా, పాకు మాత్రం ఏమీ కాలేదు. ఇదంతా వీడియో తీస్తున్నారు ఇంటిలో ఒక‌రు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యింది.

2020 Funny Videos

దేశ‌భ‌క్తికి వ‌య‌స్సుతో సంబంధం లేద‌ని ఈ బాలుడు నిరూపించాడు. ల‌డాఖ్‌లోని చూసుల్ విలేజీలో జ‌రిగిన ఈ వీడియో చాలా వైర‌ల్ అయ్యింది. ఆ దారిలో ఐటిబిపి సైనికులు వెళుతున్నారు. అప్పుడు న‌వాంగ్ అనే ఈ బుడ‌త‌డు ఐటిబిపి సైనికుల‌కు చాలా జోష్‌తో సెల్యూట్ చేస్తాడు. ఈ బుడ‌త‌డు సెల్యూట్ చేయ‌డం చూసిన సైనికులు స‌రిగ్గా సెల్యూట్ చేయ‌డం నేర్పిస్తారు. సెల్యూట్ చేయ‌డం నేర్చుకున్న త‌ర్వాత మ‌ళ్లీ ఆ బాబు సెల్యూట్ చేస్తాడు. ఈ వీడియో అక్టోబ‌ర్ 8న తీసిన‌ప్ప‌టికీ ట్విట్ట‌ర్‌లో మాత్రం ఐటిబిపి అధికారిక అకౌంట్‌లో మాత్రం అక్టోబ‌ర్ 11న పోస్టు చేశారు. అనంత‌రం మ‌రో వీడియో బాలుడిది వైర‌ల్ అయ్యింది. అక్టోబ‌ర్ 15న ఆ బాలుడు ఐటిబిపి యూనిఫాం ధ‌రించి సెల్యూట్ చేస్తాడు. ఈ బాబు వీడియో చూసిన భార‌తీయులు ఆ బాలుడిని మెచ్చుకున్నారు.

ఇది చ‌ద‌వండి : మాస్‌ మహారాజా సినిమా Krack వ‌చ్చేస్తోంది!

ఇది చ‌ద‌వండి : స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ను త‌ల‌పిస్తోన్న టిపిసిసి పోస్టు!

లింక్: ఫ‌‌న్నీ వీడియోలు చూడాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి!

Share link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *