రాష్ట్రంలో జరుగుతున్న తీవ్ర నిర్భంధాలు, అక్రమ అరెస్టులు, హత్యలు,అత్యాచారాలు, ఎన్‌కౌంటర్లను వ్యతిరేకిస్తూ ఖమ్మం పట్టణంలోని మంగళవారం ఎల్‌హెచ్‌పిఎస్‌ నంగారాభేరీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక జెడ్‌పి సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా ఇంఛార్జి భద్రునాయక్‌ మాట్లాడుతూ  పోరాడి సాధించుకున్న తెలంగాణలో భావ ప్రకటనా స్వేచ్ఛకు నియంత్రణ పెట్టడం, సభ సమావేశాల నిర్వహణపై నిర్బంధాలు పెట్టడం  ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌  రాజ్యాంగం రచించి 73 ఏళ్లు అవుతున్నా భారత రాజ్యాంగం రాజ్యాంగాన్ని , రాజ్యాంగ సూత్రాలను ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ తూట్లు పొడుస్తూ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని ఆరోపించారు. పోలీసులతో రాజ్యాన్ని పాలనను కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఉండాలని రాజ్యాంగ నిబంధనలను ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. 

Post a Comment

Previous Post Next Post