Monday, December 2, 2019

నగర వీధుల్లో 'మంత్రి పువ్వాడ' సందడి కోలాహాలం

రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు సోమవారం ఖమ్మం నగరంలోని అటు ఆర్‌టిసి ఉద్యోగుల నుండి ఇటు టిఆర్‌ఎస్‌ ముఖ్య నాయకుల  నుండి  అపూర్వ స్వాగతం ఎదురైంది. ఆదివారం సీఎం కేసీఆర్‌ తో కలిసి ఆర్‌టీసీ కార్మికుల విషయంలో తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌టిసి ఉద్యోగులు పెద్ద ఎత్తున్న ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు కూడా సొంత జిల్లా ఖమ్మంలో పలువురు అభినందనలు తెలిపారు. తొలుత ఖమ్మం డిపోను సందర్శించారు. అక్కడ బాణాసంచాలు పేల్చి, ఆర్‌టిసి ఉద్యోగులు స్వాగతం పలికారు. అనంతరం ఉద్యోగులతో కలిసి సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
ఇంటింటికి తిరిగి చెక్కుల పంపిణీ..
పువ్వాడ అజయ్‌కుమార్‌ కార్పొరేషన్‌ పరిధిలోని మేయర్‌ పాపాలాల్‌తో కలిసి 83 చెక్కులకు గాను రూ.82.60 లక్షలను స్వయంగా లభ్ధిదారులకు అందజేశారు. మంత్రి అయినా ఇంటింటికి తిరిగి ఇచ్చే పాత పద్ధతినే కొనసాగించారు. నగర వీధుల్లో ద్విచక్ర వాహనాలపై  మంత్రి సందడి చేశారు.ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలో మంజూరైన షాదిముబారక్‌ చెక్కులనుమేయర్‌ పాపాలాల్‌ తో కలిసి 11,12,13,14,15,16,17,18,19 మరియు 40 డివిజన్లలో చెక్కులు పంపిణీ చేశారు. స్థానిక నాయకులు, కార్యకర్తల నడుమ వాహనాలపై పుర వీధులలో  మంత్రి పర్యటనతో ప్రజలు హారతులు పట్టారు. చెక్కులతో పాటు, చీర, పళ్లు స్వయంగా ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడంతో వారి కుటుంబాల్లో ఆనందాలు వెల్లువిరిశాయి. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి ఇంటికే చెక్కులు తీసుకొచ్చి ఇవ్వడంతో రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు పొందారు. 





No comments:

Post a Comment