ప్రతి ఇంటిలో ఒకరికి ఉద్యోగం

ఆర్‌టిసి కార్మికుల మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ చేయూత

సమ్మె కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలపై ఆర్‌టిసి అండగా నిలిచింది. ప్రతి కుటుంబంలో ఒకిరి ఉద్యోగమిచ్చి ఆదరించింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, ఆర్‌టిసి చరిత్రలో ఇదో గొప్ప నిర్ణయంగా కార్మిక యూనియన్లు అభివర్ణిస్తున్నాయి. చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలో&్లని 33 మందికి ఉద్యోగాలిస్తూ ఆర్‌టిసి శుక్రవారం నియాకమ ఉత్తర్వులను జారీ చేసింది. మరో ఐదుగురికి విద్యార్హతలు లేకపోవడం, కుటుంబ వివాదాలతో ఉద్యోగాలు ఇవ్వలేకపోయింది. భవిష్యత్తులో వారి విషయాన్ని కూడా పరిశీలనలోకి తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 25 వరకు సమ్మె కాలంలో నలుగురు ఉద్యోగులు ఆత్మహత్య చేసుకోగా, కొంత మంది గుండెపోటుతో మృతి చెందారు. మృతి చెందిన వారి కుటుంబాల్లో  ఒకరికి ఉద్యోగమిస్తామని, రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని చెప్పారు. సమ్మె కాలంలో మొత్తం 38 మంది చనిపోయినట్లు గుర్తించారు. 
             33 మందికి ఉద్యోగాలిచ్చారు. రాష్ట్ర రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌ శర్మ జారీ వీరికి నియామక పత్రాలను అందజేశారు. వెంటనే విధుల్లో చేరాల్సిందిగా ఆదేశించారు. ఈ 33 మందిలో 14 మందికి జూనియర్‌ అసిస్టెంట్‌(పర్సనల్‌) పోస్టుల 13 మందికి కండక్టర్‌ పోస్టుల, ఆరుగురికి సెక్యూరిటీ కానిస్టేబుల్‌ పోస్టులు ఇచ్చారు. ఆర్‌టిసి సమ్మె ప్రారంభంలో మొదట ఆత్మహత్య చేసుకున్న ఖమ్మం డిపో డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి కుటుంబంలో ఎవరికీ ఉద్యోగం ఇవ్వలేదు. ఆ కుటుంబం నుంచి ఎవరూ దరఖాస్తు చేసుకోకపోవడంతో ప్రస్తుతానికి కేసును పక్కన పెట్టారు. ఉద్యోగాలు పొందిన వారి వివరాలను ఆర్‌టిసి నేడో రేపో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కాగా..మృతుల కుటుంబాలకు చెందిన 22 మందికి రూ.2 లక్షల చొప్పున కలెక్టర్లు ఎక్స్‌గ్రేషియా చెల్లించారు. 12 మందికి శనివారం ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నారు. మహిళా కండక్టర్ల కోసం ఈ నెల 15 లోగా డిపోలు, చేంజ్‌ఓవర పాయింట్ల వద్ద మరుగుదొడ్లు నిర్మించాలని ఆదేశాలు జారీ చేశారు. 

Post a Comment

0 Comments