Tuesday, December 3, 2019

సీఎం కేసీఆర్‌కు చేదు అనుభవం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఓ వివాహ కార్యక్రమానికి  హాజరయ్యేందుకు హస్తినకు వచ్చిన సీఎం కేసీఆర్‌ను అక్కడ జాతీయ మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. దిశ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదంటూ ఆయన్ను నిలదీశారు. అయితే మీడియా ప్రతినిధులకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే సీఎం కేసీఆర్‌ అక్కడ నుండి ప్రత్యేక కాన్వాయ్‌లో వెళ్లిపోయారు. దిశ ఘటన దేశాన్ని కుదిపేస్తున్న  సమయంలో కేసీఆర్‌ ఓ విలాసవంతమైన వివాహ రిసెప్షన్‌ కోసం ఢిల్లీకి వచ్చారంటూ జాతీయ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే..దిశ ఘటన వెలుగులోకి వచ్చిన రోజు సీఎం కేసీఆర్‌ టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ కుమార్తె పెళ్లికి హాజరయ్యారు. ఆ మరుసటి రోజు పిడమర్తి రవి వివాహ వేడుకకు కూడా సీఎం హాజరైనట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఆర్‌టిసి కార్మికులతో చర్చ సందర్భంగా ఈ అంశంపై ఆయన స్పందించారు. దిశకు న్యాయం జరిగేందుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలంటూ అధికారులను ఆదేశించారు. 

No comments:

Post a Comment