Saturday, December 7, 2019

ఉల్లిగడ్డల ధరలపై సీపీఎం నిరసన

తక్షణమే పెరిగిన ఉల్లిగడ్డల ధరలను తగ్గించాలని  డిమాండ్‌ చేస్తూ ఖమ్మం సీపీఎం టూటౌన్‌ కమిటీ ఆధ్వర్యంలో సరితాక్లీనిక్‌  సెంటర్‌ వద్ద ఉల్లి దండలతో పెరిగిన ధరలపై శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ  బిజెపి ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత వినాశకర విధానాలతో దేశాన్ని భ్రష్టు పట్టిస్తుందని  తన చేతగానితనంతో దళారులను కంట్రోల్‌ చేయలేకపోక ప్రభుత్వం చేతులెత్తివేసిందని విమర్శించారు. గతంలో రూ.100 వరకు ఉల్లిగడ్డల ధర పెరిగి ప్రభుత్వం పడిపోయిందని  గుర్తు చేశారు. మోడీ ప్రభుత్వం వెంటనే మేల్కొని ధరలు తగ్గించకపోతే ప్రజలు తిరగబడే పరిస్థితి తొందరలో ఉందని ఆరోపించారు.  తక్షణమే ఉల్లిగడ్డల ధరలను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం ఖమ్మం టు టౌన్‌ కార్యదర్శి వై. విక్రమ్‌, నాయకులు నందిపాటి మనోహర్‌, అశోక్‌, బి.వెంకట్‌కు మార్‌, నర్రా రమేష్‌, ఆర్‌.గురుమూర్తి, గంటా భీములు, వీరబాబు, బి.ఇందిర, భద్రం, షేక్‌.బేబీ, చిరంజీవి, ప్రవీణ్‌, ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment