రైతులంటే చిన్నచూపా..?:కదంతొక్కిన కామ్రేడ్లు..!

 ఖమ్మంలో రైతులతో సీపీఐ(ఎం) భారీ ప్రదర్శన, ధర్నా

మోడీ, కేసీఆర్‌కు రైతులంటే చాలా చిన్నచూపనీ, వీరిద్దరి పాలనలో రైతులకు ఒరిగిందేమీ లేదని, నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన కాలంలోనే లక్షా 15 వేల మంది ఆత్మహత్య చేసుకున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు ధ్వజమెత్తారు. రైతులకు ఏకకాలంలో రుణమాపీ చేయాలనీ, గిట్టుబాటు ధరలకు పంటలు కొనుగోలు చేయాలనీ, రైతుబంధును విడుదల చేయాలని డిమాండ్‌చేస్తూ మంగళవారం ఖమ్మంలో పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు యర్రా శ్రీకాంత్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ధరా&్న కార్యక్రమంలో పోతినేని మాట్లాడుతూ..గడిచిన ఐదేండ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు చేసిందేమీ లేదన్నారు. కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలో కేసీఆర్‌ విధానాలు పూర్తిగా రైతుల వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. మోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన ఐదేండ్లలో దేశవ్యాప్తంగా పెద్దఎత్తున రైతుల ఉద్యమాలు జరిగాయనా&్నరు. మధ్యప్రదేశ్‌లో పెద్ద ఎత్తున రైతుల ఉద్యమాలు చోటు చేసున్నాయనీ, ఆ సమయంలో బీజేపీ ప్రభుత్వం రైతులపై కాల్పులు జరిపి ఐదుగురు రైతులను పొట్టన పెట్టుకుందన్నారు.రాజస్థానలో పెద్ద ఎత్తున రైతు ఉద్యమం జరిగిందన్నారు. ఆ రైతుల ఉద్యమానికి నాయకత్వం వహించిన నలుగురు సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలను గెలిపించి శాసన సభకు పంపారని అన్నారు. ఢిలీల్లఓ పెద్ద ఎత్తున రైతు ఉద్యమం జరిగిందన్నారు. మహారాష్ట్రంలో 15 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారనీ అందుకే నాసిక్‌ నుండి ముంబాయి దాకా 250 కి.మీ దూరం 50 వేల మంది గిరిజన రైతులు పాదయాత్ర చేశారని గుర్తు చేశారు.
           పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ సరళీ కరణ విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఏకంగా 5 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పంటలు పండించిన రైతులు అప్పుల పాలవుతుంటే దళారులు మాత్రం రైతుల వద్ద తక్కువ పంట కొని, మంచి ధరలకు అమ్ముకుంటూ  పండుగ చేసుకుంటున్నారని అన్నారు. రైతుల  సమస్యలు పరిష్కరించేంత వరకూ పోరుబాట పట్టాలన్నారు. అధికారంలోకి రావడానికే ఎన్నికల ముందు కేసీఆర్‌కు రైతులు గుర్తుకొచ్చారన్నారు.
           పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం  వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. రైతులకు కేసీఆర్‌ పాలన అంటే కడుపు మండిపోతుందన్నారు. పాస్‌ పుస్తకాలు ఇవ్వకుండా రైతులను తిప్పలు పెడుతున్నారని వారు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి తీసుకొస్తున్నారని  పేర్కొన్నారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత  భూ వివాదాలు ఎక్కువైపోయాయని అన్నారు. రుణమాఫీ చెప్పి ఓట్లు పొంది ఇప్పుడు రైతులను గాలికొదిలేశారని విమర్శించారు.ఇకనైనా ప్రభుత్వం స్పందించి రుణమాఫీని ఏకకాలంలో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు
.
         ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బత్తుల లెనిన్‌, భూక్యా వీరభద్రం, మాచర్ల భారతి, బండి రమేష్‌, కళ్యాణం వెంకటేశ్వరరావు, తాళ్ల నాగరాజు, రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొంతు రాంబాబు, మాదినేని రమేష్‌, జిల్లా  కమిటీ సభ్యులు యర్రా శ్రీనివాసరావు, నందిపాటి మనోహర్‌, జబ్బార్‌, బండి పద్మ, చింతలచెర్వు  కోటేశ్వరరావు, గట్టు రమాదేవి, తాళ్లపల్లి కృష్ణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


Post a Comment

0 Comments