నేటి అర్థరాత్రి నుండే అమలు..!

ఇక కనీస ఆర్‌టిసి ఛార్జీ రూ.10 

తెలంగాణ ఆర్‌టిసి బస్సుల్లో ఛార్జీలను కిలోమీటరుకు 20 పైసలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో బస్సుల్లో కనీస ఛార్జీని అధికారులు వెల్లడించారు. పల్లెవెలుగు, సిటీ ఆర్డనరీ బస్సుల్లో కనీస ఛార్జీని రూ.10 గా నిర్ణయించారు. ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో  రూ.15 కనీస ఛార్జీలను వసూలు చేయనున్నారు. డీలక్స్‌ బస్సుల్లో  రూ.20, సూపర్‌ లగ్జరీల్లో రూ.25, రాజధాని, వజ్ర, గరుఢ, గరుఢ ప్లస్‌ ఏసీ బస్సుల్లో రూ.35 లను కనీస ఛార్జీలుగా నిర్ణయించారు. వెన్నల ఏసీ స్లీపర్‌ కనీస ఛార్జీలను రూ.70కి పెంచారు. ఈ మేరకు కొత్త ధరలను టిమ్‌ యంత్రాల్లో నిక్షిప్తం చేస్తున్నారు. పెరిగిన ఛార్జీలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. పెరిగిన ఛార్జీలు ఆయా ఏరియాల్లో ఏ విధంగా ఉన్నాయో క్రింద ఇవ్వబడినాయి.
సిటీ బస్‌ పాస్‌లు

సిటీ బస్సులు

జిల్లా సర్వీస్‌ బస్సులు

 పల్లె వెలుగు బస్సులు
హైదరాబాద్‌ గ్రేటర్‌ పరిధిలో..
  • గ్రేటర్‌ హైదరాబాద్‌లో రౌండింగ్‌ ధర రూ.5 యథావిధిగా కొనసాగనుంది. కనీస ఛార్జీ మాత్రం రూ.10 నిర్ణయించారు.
  • ఆర్డనరీ ప్రస్తుత కనీస ధర రూ.5గా ఉండగా..రూ.10 కి పెంచారు. గరిష్ట ధరను రూ.30 నుంచి రూ.35కి పెంచారు.
  • మెట్రో ఎక్స్‌ప్రెస్‌ కనీస ధర రూ.10 ఉండగా ఇందులో మార్పుల్లేవు. గరిష్ట ధర రూ.30 నుంచి రూ.35కి పెంచారు.
  • మెట్రో డీలక్స్‌ కనీస ఛార్జీ రూ.10 ఉండగా, దాన్ని రూ.15కు పెంచారు. గరిష్ట ధర రూ.30 నుంచి రూ.45కి పెంచారు.

Post a Comment

0 Comments