చటాన్‌పల్లి 'దిశ'ఎన్‌కౌంటర్‌లో వాడిన తూటాలేవీ రికవరీ కాలేదనేది తెలుస్తోంది. మృతుల శరీరంలో బుల్లెట్‌ గాయాలే తప్పా, ఏ ఒక్క చోటా కూడా బుల్లెట్లు లభించలేదు. నలుగురి నిందితులు ఎన్‌కౌంటర్‌లో చనిపోగా నలుగురికి 11 చోట్ల గాయాలైనట్టు పోస్టుమార్టమ్‌లో తేలింది.  ఘటనా స్థలంలోనే పోలీసులు  బుల్లెట్ల కోసం  వెతికినట్లు సమాచారం. ఫైర్‌ జరిగిన ప్రాంతంలో సెల్స్‌నైనా గుర్తించాలని ప్రయత్నించినట్లు తెలిసింది. అధికార యంత్రాంగం బుల్లెట్ల గురించి ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించలేదు.పక్కా పోస్టుమార్టమ్‌ అనంతరం అందిన పక్కా సమాచారం మేరకు పోస్టుమార్టమ్‌లో మృతుల శరీరాల్లో  చూస్తే ఏ ఒక్కరి దేహంలో ఒక్క బుల్లెట్‌ కూడా రికవరీ కాలేదని, అన్ని కూడా బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఏ-1 నిందితుడు మహ్మద్‌ ఆరీఫ్‌ శరీరంలో నాలుగు చోట్ల బుల్లెట్ల గాయాలున్నాయి. రెండు ఛాతిలో, ఒకటి పక్క టెముకల్లో దిగినట్లు తెలుస్తోంది. మరో బుల్లెట్‌ గాయం వీపు ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం.
ఏ-2 నిందితుడు శివ శరీరంపై  మూడు బుల్లెట్‌ గాయాలున్నాయి. ఇందులో రెండు కిడ్నీ ప్రాంతలో  ఒకటి పుర్సల దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఏ-3 నిందితుడు నవీన్‌ దేహంలో మూడు చోట్ల బుల్లెట్‌ గాయాలున్నాయి. ఇందులో ఒకటి తలలోంచి వెళ్లగా రెండు ఛాతిలోంచి వెళ్లినట్టు తెలిసింది. ఏ-4 నిందితుడు చెన్నకేశవశరీరంలో  ఒకేతూటా దిగినట్టు సమాచారం. ఇతనికి గొంతు భాగంలోంచి తూటావెళ్లినట్టు సమాచారం. కాగా ఎన్‌కౌంటర్‌ సమీపంలోంచి జరగడం వల్ల బుల్లెట్లు దేహంలో లేకుండా బయటకు వెళ్లినట్లు నిపుణులు చెబుతున్నారు. 

Post a Comment

Previous Post Next Post