డాక్టర్‌ ప్రియాంకరెడ్డి, మానసల ఘటనలపై ఖమ్మం పట్టణంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిందితులను వెంటనే శిక్షించాలని మహిళలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మానవహారం నిర్వహించారు. మహిళలు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 


కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో...
జిల్లా మహిళా కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో మహిళలు, విద్యార్థినులు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేసుకుంటూ మానవ హారం నిర్వహించారు. సమాజంలో స్త్రీలు ఒంటరిగా తిరిగే పరిస్థితి లేకుండా పోయిందని, చివరకు చిన్న పిల్లలు సైతం ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళరక్షణకు అనేక చట్టాలు ఉన్నప్పటికీ సకాలంలో రక్షణ కల్పించడంలో వ్యవస్థ విఫలమవుతుందని అందువల్ల శిక్షలు అమలు చేయడంలో ఎలాంటి విచక్షణా లేకుండా సకాలంలో చర్యలు తీసుకుంటే ఇలాంటి దుర్మార్గులకు కొంత భయబ్రాంతులకు గురౌవుతారని పేర్కొన్నారు. ప్రియాంకరెడ్డి, మానస హత్యకేసులో నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళాకాంగ్రెస్‌ కమిటీ జిల్లా అధ్యక్షులు బండి మణి, ఉపాధ్యక్షులు  పరిమి అనంతలక్ష్మి, జిల్లా కాంగ్రెస్‌ ఓబిసి జిల్లా అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, యువజన కాంగ్రెస్‌ నాయకులు సంతోష్‌, ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షులు వేగినాటి ఉదయ్‌ తదితరులు పాల్గొన్నారు. 

సీపీఎం ఆధ్వర్యంలో...
పట్టణంలో స్థానిక 43వ డివిజన్‌లో సీపీఎం కార్పొరేటర్‌ యర్రా శైలజ ఒక్క రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ప్రియాంకరెడ్డిపై హత్యాచారం హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అని ప్రశ్నించారు. మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం విచారకరమన్నారు. నిందితులను ఫాస్ట్‌ట్రాక్‌  కోర్టుల ద్వారా ఉరిశిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు ధనమ్మ, నిర్మల, ఎన్‌.లక్ష్మి, ఎ.సత్యవతి, వి.వెంకటి,యర్రా సుజాత, నాగమణి, నాయకులు ఆవుల శ్రీనివాస్‌, మస్తాన్‌, బి.పాపారావు, బి.అయ్యప్ప, నర్రా శ్రీను తదితరులు పాల్గొన్నారు. 


 
 పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో..
ప్రియాంకరెడ్డి, మానసలపై జరిగిన హత్యాచారాలను, హత్యలను ఖండిస్తూ ఆదివారం ఖమ్మంలో ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ) ఆధ్వర్యంలో  సీపీఐఎంఎల్‌(న్యూడెమెక్రసీ) ఆఫీస్‌ నుండి ప్రదర్శనగా మయూరిసెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కామపిశాచి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దేశంలో రోజురోజుకూ మహిళపై దాడులు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. యువత ఇలాంటి చర్యలకు పాల్పడే విధంగా ప్రభుత్వాలే అనేక రకాలుగా మత్తుమందు, హింస, అశ్లీల సాహిత్యం, బూతు సినిమాలు, సీరియల్స్‌, గుట్కా విషసంస్కృతి తదితర అసభ్యకరమైన బావాజాలాన్ని అరికట్టకుండా ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా మహిళా నాయకులు కె.కల్పన, లలిత,పి.శోభారాణి, జ్యోతి, శ్రీలత, దేవకరణ తదితరులు పాల్గొన్నారు. 


Post a Comment

Previous Post Next Post