సానుభూతి వద్దు...న్యాయం చేయండి

శంషాబాద్‌లో వెటర్నరీ వైద్యురాలు హత్యోదంతంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మృతురాలి కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్న గేటెడ్‌ కమ్యూనిటీ'నక్షత్ర విల్లా' వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ప్రవేశద్వారం వద్ద కాలనీ వాసులు ఆందోళన చేపడుతున్నారు. కాలనీ గేటుకు లోపలి నుంచి తాళాలు వేసి, పోలీసులు, నాయకులు ఇటువైపు రావద్దంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. విల్లాలో ఉన్న పోలీసులను బయటకు పంపేశారు. కాలనీకి చెందిన మహిళలంతా అక్కడ బైఠాయించి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే స్థానికులను లోపలికి అనుమతిస్తున్నారు. ఘటన పట్ల కేసీఆర్‌ స్పందించి వెంటనే న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. పరామర్శలు, సానుభూతులు వద్దని న్యాయం కావాలంటూ నినాదాలు చేస్తున్నారు.
స్థానికుల నిరసనలతో పోలీసులు, పలువురు నాయకులు యువతి ఇంటి నుండి వెనుదిరిగారు. బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి, ఇతర నేతలు రాగా, స్థానిక మహిళలు వారిని అడ్డుకున్నారు. గేటు బయటే వారిని నిలువరించి, తమకు సానుభూతి అవసరం లేదని, న్యాయం చేయాలని కోరారు. దీంతో మద్దతు తెలిపేందుకు వచ్చిన నేతలు గేటు బయటే మహిళలతో కలిసిన నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

Post a Comment

0 Comments