'100'కు డయిల్‌..పెట్రోల్‌ తీసుకొచ్చిన పోలీసులు


కొద్ది రోజులుగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పోలీసులు ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉంటున్నారు. ముఖ్యంగా మహిళల విషయంలో క్షణాల్లో స్పదిస్తున్నారు అనేందుకు ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. ప్రయాణం మధ్యలో పెట్రోలు అయిపోయిదంటూ ఓ యువతి '100' టోల్‌ ఫ్రీ నెంబర్‌కు డయల్‌ చేసింది. తాను పడుతున్న ఇబ్బందిని, తన వాహనం ఆగిపోయిన వివరాలను పోలీసులకు సమాచారం అందించింది.వెంటనే పోలీసులు పెట్రోల్‌ బాటిల్‌తో యువతి ఉన్న ప్రదేశం వద్దకు వచ్చారు. యువతి వాహనంలో పెట్రోలు పోసి తగు జాగ్రత్తలు చెప్పి పంపించారు. ఈ ఘటన రాచకొండ పరిధిలో జరిగింది.రాచకొండ పోలీసులు ఈ ఫొటోను తమ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇప్పుడు అది తెగ వైరల్‌ అవుతోంది. యువతి ఫోన్‌కు స్పందించి సాయం చేసిన పోలీసులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Post a Comment

0 Comments