వామ్మో...! నకిలీ హెల్మెట్లు..!

రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతుండటంతో.. నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మితిమీరిన వేగం, అంతులేని నిర్లక్ష్యం కారణంగా అమాయకులు బలవుతున్నారు. పెరుగుతున్న ద్విచక్ర వాహనాల ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని సోమవారం సైబరాబాద్‌ పోలీసులు ప్రమాదాల చర్యలు నియంత్రణకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నగర వ్యాప్తంగా హెల్మెట్‌ డ్రైవ్‌ చేపట్టారు. నకిలీ ఐఎస్‌ఐ మార్క్‌తో కూడిన హెల్మెట్లు విక్రయించే వారిపై కొరడా జులుపించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నకిలీ హెల్మెట్లు అమ్మకాలు చేస్తున్న వారి నుంచి భారీగా నకిలీ హెల్మెట్లు స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక వాటిని ధ్వంసం చేయడంతో పాటు అమ్మకం దారులపై కేసులు పెట్టి.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఏమాత్రమూ నాణ్యత లేని నకిలీ హెల్మెట్ల కారణంగా నగరంలోని వందలాది సంఖ్యలో వాహన దారులు ప్రమాదాల బారిన పడుతున్నారని అందుకే హెల్మెట్‌ డ్రైవ్‌ చేపట్టామని సైబరాబాద్‌ పోలీసులు పేర్కొన్నారు. 

Post a Comment

0 Comments