Tuesday, November 26, 2019

ఖమ్మం డిపో కార్మికులకు చేయూతనందించిన టిఎస్‌యుటిఎఫ్‌

గత 53 రోజులుగా న్యాయమైన డిమాండ్ల కోసం ఆర్‌టిసి పరిరక్షణ కోసం సమ్మె చేస్తున్న ఆర్‌టిసి కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌  ఖమ్మం జిల్లా కమిటీ(టిఎస్‌యుటిఎఫ్‌) ఆధ్వర్యంలో ఖమ్మం డిపోలో పనిచేస్తున్న కార్మికులకు రూ.లక్షా 10 వేల విలువ చేసే 25 క్వింటాళ్ల (100 టిక్కిల) బియ్యాని విరాళంగా మంగళవారం అందజేశారు. ఇందులో 75 టిక్కీలను ఆర్‌టిసి జెఎసి, 25 టిక్కీలను టిఎస్‌యుటిఎఫ్‌ సంఘం ద్వారా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి మాట్లాడుతూ ప్రభుత్వం సమ్మె చేస్తున్న కార్మికుల పట్ల శత్రుపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రజా రవాణా సంస్థ భవిష్యత్తు కోసం, 50 వేల కుటుంబాల బాగుకోసం జేఏసీ నిర్ణయం మేరకు కార్మికులందర్నీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ప్రైవేటీకరణ అనే అనాలోచిత నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గా భవానీ, ఖమ్మం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు జివి నాగమల్లేశ్వరరావు, ఎన్‌.వీరబాబు,నాయకులు సిహెచ్‌.సుభాషిణి, ఎస్‌కె.మహబూబ్‌అలీ, బి.వెంకన్న, పి.నాగేంద్రరావు, ఎం.శ్రీకాంత్‌, సురేష్‌, నాగేశ్వరరావు, రవికుమార్‌, డి.శ్రీనివాస్‌, జెఎసి నాయకులు శ్రీనివాసరెడ్డి, మాధవరావు, టి.బాబు, పి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment