Tuesday, November 26, 2019

రాజ్యాంగం పట్ల విధేయత కలిగి ఉండాలి: లింగాల కమల్‌రాజ్‌

డా||బిఆర్‌ అంబేద్కర్‌  రచించిన భారత రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ విధేయత కలిగి ఉండాలని జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ లింగాల కమల్‌ రాజ్‌ పేర్కొన్నారు. రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన కాజీపురం లోని పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహనీయుల ఆదర్శంగా తీసుకొని మంచి ఆలోచన విధానాలతో విద్యార్థులు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ ఏ ప్రభాకర్‌రెడ్డి, టిఆర్‌ఎస్‌ పార్టీ కార్యదర్శి చిత్తారి నాగేశ్వరరావు, మధిర వైస్‌ ఎంపీపీ సామినేని సురేష్‌, రావూరి శ్రీనివాసరావు,  నెహ్రు,  యువ కేంద్ర  మధిర మండల కోఆర్డినేటర్‌ ఆర్‌ రాజేష్‌, వేల్పుల శివ, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మంలో..
భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా ఖమ్మంలోని జెడ్‌పి సెంటర్‌లోని బిఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంబిసి అధ్యక్షులు షేక్‌.షకీనా, ఎంబిసి ప్రధాన కార్యదర్శి దరిపల్లి శ్రీనివాస్‌, టిఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు బొజెడ్ల రామ్మోహన్‌, 45వ డివిజన్‌ టిఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి దరిపల్లి కళావతి, లాయర్‌ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment