'నీడ'తెర నిలువునా ముంచింది..!

ఆధునిక వ్యవసాయాన్ని ఆశ్రయిస్తే అసలుకే మోసం...రైతు ఆందోళన

ఆధునిక వ్యవసాయం ఒక్కొక్కసారి..రైతును ఎంత మోసం చేస్తుందో...!!, ఆ కంపెనీ..ఈ కంపెనీ అంటూ మాటలతో మాయచేసి రైతులపై ప్రయోగాలు చేస్తూ నకిలీ వస్తువుల అమ్మే వ్యాపారుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి..అనేందుకు ఈ సాటి రైతు బాధే నిదర్శనం.. జిల్లాలో కారేపల్లి మండలం లింగంబంజరకు చెందిన మొగిలిచర్ల మల్లిఖార్జున్‌ ఆధునిక వ్యవసాయం చేయాలనుకున్నాడు. తోటి రైతు సలహాలతో ఖానాపురంలోని గ్రీన్‌సొల్యుషన్స్‌ షాపులో షాడో తెర, ట్రేలు, కోక్‌ పిట్‌ కొనుగోలు చేశాడు. దానికి సంబంధించి ఆ షాపు యాజమాన్యం కేవలం తెల్లకాగితంపై మాత్రమే బిల్లు రాసి ఇచ్చారు. షాడో తెర(గ్రీన్‌ హౌస్‌) పందిరిలా వేసి దాని సంరక్షణలో ట్రేలలో మిర్చి నారును విత్తాడు. రెండు నెలల్లో రావాల్సిన నారు మూడు నెలలైనా రాకపోవడంతో అనుమానం వచ్చి తోటి రైతులను, అధికారులను సంప్రదించగా ట్రేలలో ఉన్న మిర్చి నారును షాడో తెర పందిరి నుంచి బయట ఉంచి పరిశీలించాలని సలహా ఇచ్చారు. ట్రేలను పందిరి బయట ఉంచగా ఆ నారు ఏపుగాపెరిగింది. నాసీరకం షాడో తెర పందిరి మూలంగా సూర్యరశ్మి అందక మిర్చినారు పెరగకుండా కుళ్లిపోవడం, వంకర తిరగిందని పేర్కొన్నారు. తెరను  అమ్మిన దుకాణాదారుడిని సంప్రదించగా బిల్లు అడిగితే ఇవ్వడానికి నిరాకరించాడని బాధిత రైతు పేర్కొన్నాడు. గ్రీన్‌ హౌస్‌ కింద పెంచి నష్టపోయిన రైతు మిర్చినారును హార్టికల్చర్‌ విస్తరణాధికారి జరీనా పరిశీలించారు. ఈ విషయం ఉన్నతాధికారులకు నివేదిస్తానని తేల్చినట్టు తెలిపారు. మొత్తంగా రూ.లక్ష నష్టం వాటిల్లిందని నాకు అధికారులు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.


Post a Comment

0 Comments