Wednesday, November 27, 2019

కెయులో లాఠీఛార్జ్‌, ఉద్రిక్తత

సిలబస్సే కాలేదు..సెమిస్టర్లా..?

కాకతీయ యూనివర్శిటీలో డిగ్రీ సిలబస్‌ ఇంకా పూర్తికాకముందే సెమిస్టర్‌ పరీక్షలు పెట్టడం వల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఏబీవీపీ విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. శాంతియుతంగా నిరసనలు చేపడు తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 
90 రోజుల షెడ్యూల్‌ క్లాసులు పూర్తిగా జరగకముందే పరీక్షలు పెట్టడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో యూనివర్శిటీ రిజిస్టర్‌ చాంబర్‌ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎంతసేపు నిరసన చేపట్టినప్పటికీ అధికారులు స్పందింకపోవడంతో విద్యార్థులు లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్‌కి దిగారు. శాంతియుతంగా నిరసనలు చేపడుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్‌ ఝలిపించడం పట్ల  విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

No comments:

Post a Comment