భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరుస దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతున్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన మహమ్మద్‌ అఫ్తాబ్‌ అన్సారీ అనే వ్యక్తి కటకటాల పాలయ్యాడు.జిల్లా కలెక్టర్‌ రజత్‌ కుమార్‌సైని ఉత్తర్వుల మేరకు ఎస్పీ సునీల్‌దత్‌ ఆదేశాలతో  పిడియాక్టు నమోదు చేసినట్లు చుంచుపల్లి సిఐ అశోక్‌ తెలిపారు. ప్రస్తుతం భద్రాచలం సబ్‌జైలులో రిమాండ్లో ఉన్న మహమ్మద్‌ అఫ్తాబ్‌ అన్సారీకి జైలు సూపరింటెండెంట& ఆనందరావు సమక్షంలో పిడియాక్టు ఉత్తర్వులు అందజేసినట్లు సిఐ తెలిపారు.
ఈ వ్యక్తి మూడు సంవత్సరాలుగా ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మరొక ముగ్గురు వ్యక్తులతో ఒక ముఠాగా ఏర్పడి ఏపీలోనూ, తెలంగాణలోనూ వరుస చోరీలకు, దోపిడీలకు పాల్పడ్డారు. లగ్జరీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు, ఒంటరిగాప్రయాణించే వారిని లక్ష్యంగా చేసుకొని వీరు దొంగతనాలకు పాల్పడుతుంటారని సిఐ పేర్కొన్నారు. మూడు నెలల్లో ఈ నలుగురిపై జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి, చంచుపల్లి, భద్రాచలం పోలీస్‌స్టేషన్లో 2 చోరీ కేసులు, 1 దోపిడీ కేసు నమోదైనట్లు తెలిపారు. సుమారుగా రూ.60 లక్షలు చోరీ చేసినట్లు పేర్కొన్నారు. ఏపీలో ధర్మవరంతో పాటు పలు పోలీసుస్టేషన్లో వీరిపై కేసులు ఉన్నట్లు తెలిపారు. 

Post a Comment

Previous Post Next Post