Sunday, November 24, 2019

గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి

 గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన ములకలపల్లి మండలంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పాల్వంచ మండలం నవ భారత్ కు చెందిన పొప్పారి రాము(24) తాపీ మేస్త్రి గా పని చేస్తున్నాడు. ములకలపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన దుబ్బ జయను ఆరు నెలల కిందట వివాహం చేసుకున్నాడు. అత్తగారి ఇంటి దగ్గరే ఉంటూ నవభారత్ లో తాపీ మేస్త్రి గా పనిచేసి ఇంటికి వెళ్తున్నాడు. తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మాదారం సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాము అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

No comments:

Post a Comment