Sunday, November 24, 2019

గుండెపోటుతో ప్రముఖ వైద్యురాలు మృతి

ఖమ్మం నగరంలోని 'న్యూఇరా' సంస్థల అధినేత ఐవి.రమణారావు సతీమణి డాక్టర్ విజయలక్ష్మి (56)గుండెపోటుతో ఆదివారం కిమ్స్ ఆస్పత్రిలో మృతి చెందారు. ఈమె నగరంలోని ప్రముఖ వైద్యురాలు. పలు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని రోగులకు సేవలందించారు. నగరంలోని సిపిఎం-బి వి కే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో  ఉచితంగా సేవలు అందించారు. ఆమె అకాల మరణం పట్ల పలువురు  నివాళులర్పించి సంతాపం ప్రకటించారు.


No comments:

Post a Comment