Friday, November 22, 2019

జేఏసీకి షాక్‌..సిఎం నిర్ణయంపై ఉత్కంఠ..!

ఆర్‌టిసి సమ్మె విషయంలో జేఏసీకి షాక్‌ తగిలినంత పనైంది. ఆర్‌టిసి రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ శుక్రవారం ఇచ్చింది. రూట్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. 5100 రూట్లను ప్రైవేటుకు అప్పగిస్తూ రాష్ట్ర కేబినేట్‌ తీసుకున్న నిర్ణయం తప్పుబట్టలేమని స్పష్టం చేసింది.
సీఎం నిర్ణయం ఏమిటో..?
ఈ క్రమంలో రూట్ల ప్రైవేటీకరణ విషయంలో అడ్వకేట్‌ జనరల్‌ ప్రభుత్వ తరపున వాదనలు గట్టిగా వినిపించారు. ప్రభుత్వానికి సానుకూలంగా తీర్పు రావడంతో సీఎం కేసీఆర్‌ రూట్ల ప్రైవేటీకరణపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆర్‌టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకునే అంశంపై సీఎం కేసీఆర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని టెన్షన్‌ మొదలైంది. దాదాపు గత 50 రోజులుగా ఆర్‌టిసి కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత గురువారం సమ్మె విరమిస్తున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు. మళ్లీ శుక్రవారం సమ్మెను యథాతథంగా కొనసాగిస్తామని ప్రకటించారు.
జోక్యం చేసుకోలేం:కోర్టు
ఆర్‌టీసీ ప్రైవేటీకరణపై సుదీర్ఘ వాదోపవాదలు జరిగాయని న్యాయవాది ఒకరు తెలిపారు.మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌ 1988 సెక్షన్‌ 102 ప్రకారం ప్రైవేటీకరణ చేసే అవకాశం ఉంది. మంత్రివర్గానికి విస్తృత అవకాశాలున్నాయి. కోర్టులు జోక్యం చేసుకోజాలవని పేర్కొంది. ఈ మేరకు అడ్వకేట్‌ జనరల్‌ చేసిన వాదనలతో హైకోర్టు ఏకీభవించిందన్నారు. పబ్లిక్‌ లిటిగేషన్స్‌ కొట్టివేయడం జరిగిందన్నారు. ప్రజల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా జోక్యం చేసుకోలేమని చెప్పినట్లు న్యాయవాది తెలిపారు. 

No comments:

Post a Comment