Tuesday, November 12, 2019

దారుణం..ఒంటరి మహిళపై...

ఖమ్మం జిల్లా కేంద్రం సరిహద్దులోని దనవాయిగూడెంలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. ఒంటరిగా జీవనం సాగిస్తున్న ఓ మహిళపై వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కిరోసిన్‌ పోసి నిప్పటించాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు తీవ్రంగా గాయపడిన మహిళను ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పాత కక్షల నేపథ్యంలోనే వెంకటేశ్వర్లు ఈ దాడికి పాల్పడినట్టు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment