అవినీతిపై అంబటి రాయుడు వర్సెస్‌ అహజరుద్దీన్‌ 'ఆట'

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం(హెచ్‌సీఏ) అవినీతిలో కూరుకుపోయిందని తాను చేసిన వ్యాఖ్యలను వ్యక్తిగతంగా తీసుకోవద్దని హెచ్‌సీఏ అధ్యక్షుడు అహజరుద్దీన్‌ను సీనియర్‌ ఆటగాడు అంబటి రాయుడు కోరారు. 'కేటీఆర్‌ సర్‌.హెచ్‌సీఏలో పేరుకుపోయిన అవినీతిపై దృష్టి పెట్టి దాన్ని నిర్మూలించాలని కోరుతున్నా..' అని గత శనివారం రాయుడు ట్విటర్‌ వేదికగా, మంత్రి కేటిఆర్‌ను కోరాడు. డబ్బుతో పాటు ఎన్నో ఏసీబీ కేసులు ఎదుర్కొంటున్న అవినీతి పరుల ప్రభావం పడ్డ జట్టుతో హైదరాబాద్‌ క్రికెట్‌ గొప్పగా ఎలా ఎదుగుతుందని కూడా ప్రశ్నించాడు. ఈ ట్విట్‌పై హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌ స్పందిచాడు. రాయుడు 'అసహన క్రికెటర్‌' అంటూ పేర్కొన్నాడు. అజహర్‌ వ్యాఖ్యలపై ఆదివారం అంబటి రాయుడు స్పందించాడు. ఈ సందర్భంగా ''హాయ్‌ అజహరుద్దీన్‌.. ఈ విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఇది మనిద్దరి కన్నా పెద్దది. హెచ్‌సీఏలో ఏం జరుగుతుందో మనిద్దరికీ తెలుసు. కుట్రలకు దూరంగా ఉంటూ నిపాక్షికంగా వ్యవహరిస్తారని బలంగా నమ్ముతున్నా. హైదరాబాద్‌ క్రికెట్‌ను ప్రక్షాళన చేసే అవకాశం మీకుంది. భవిష్యత్‌ క్రికెటర్లను కాపాడతారని ఆశిస్తున్నా..'' అంటూ ట్విటర్‌లో పోస్టు చేశాడు.
ఇటీవల కాలంలో హెచ్‌సీఏలో రాజకీయాలపై అసంతృప్తిగా ఉన్న రాయుడు జట్టుకు దూరంగా ఉండాలని నిర్ణయిం చుకున్నాడు. ఈ విరామం ఎంత కాలం అన్నది స్పష్టం చేయలేదు. 'ఈ సీజన్‌లో రంజీ ట్రోపీలో ఆడాలను కున్నా..దురదృష్టవశాత్తు అలా జరగలేదు. జట్టులో రాజకీయాల కారణంగా ఆటను ఆస్వాదించే పరిణామాలు కనిపించడం లేదు. ప్రస్తుత జట్టుతో అసౌకర్యంగా ఉన్నా. ఈ విషయమై హెచసీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌తో మాట్లాడినా ఫలితం లేదు. అర్హత లేని ఆటగాళ్లు చాలామంది జట్టులో చేరుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే జట్టు ప్రదర్శన ఎలా మెరుగవుతుంది.'' అని ప్రశ్నించాడు.

Post a Comment

0 Comments